
కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయండి
మంగళగిరి: నేటి విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయాలని బెర్హంపూర్ ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(బసర్) యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్ గంగూలీ కోరారు. మండలంలోని నీరుకొండ గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం 9వ రీసెర్చ్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంగూలీ మాట్లాడుతూ బోధనతో పాటు పరిశోధనా రంగంలో రాణించేలా ప్రొఫెసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌తోపాటు పరిశ్రమల సందర్శన ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ థాఫా మాట్లాడుతూ రీసెర్చ్ డేను పురస్కరించుకుని కిండబేజాద్ మాదిరిగా నలుగురు ప్రొఫెసర్లుకు ఉత్తమ పరిశోధనా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ ప్రయోగాత్మక పరిశోధన పురస్కారాన్ని డాక్టర్ మాసం పార్థసారథి,ఉత్తమ థియోలాటికల్ రీసెర్చ్ అవార్డును డాక్టర్ ఎండూరి మురళీకృష్ణ, ఉత్తమ పారిశ్రామిక రంగ పరిశోధనా పురస్కారాన్ని డాక్టర్ దినేష్‌రెడ్డి, ఉత్తమ యువ పరిశోధన పురస్కారం డాక్టర్ హరీష్ పుప్పాలలకు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారికి రూ.50 వేలు నగదు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్‌కుమార్, రీసెర్చ్ డే కన్యీనర్ డాక్టర్ సునీల్ చిన్నదురై, డాక్టర్ ఆయాషా తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీలలో పరిశోధనలు పెరగాలి బెర్హంపూర్ బసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్ గంగూలి