
ఇంటర్ ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి వెళ్లిన విద్య
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడి, తాడేపల్లిలో నివాసముండే ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఇంట ర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి పారిపోయారు. తాడేపల్లిలో ఉన్న విద్యార్థిని తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి శుక్రవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఖాజావలి మాట్లాడుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తమ పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి సిఐ కల్యాణ్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో వారి ఆచూకీ కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగింత