
బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ఆదుకోవాలి
రేపల్లె రూరల్: వెట్టిచాకిరికి గురైన బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కూలీలను క్రయవిక్రయాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, ఎస్టీ కాలనీవాసులు శుక్రవారం ఆర్డీఓ నేలపు రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ అమ్మకాలు, కొనుగోలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మణిలాల్, అగస్టీన్, నాంచారమ్మ, ఆశీర్వాదం, డానియేలు తదితరులు పాల్గొన్నారు.