
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అమరావతి: గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు అసలు కొనే నాథుడు లేక కంది రైతులు నిరాశలో కూరుకుపోయారు. అప్పులకు వడ్డీలు కట్టలేక, అయిన కాడికి పంటను తెగనమ్ముకుంటున్నారు. కూటమి సర్కారు ఘనంగా మద్దతు ధర రూ.7550 ప్రకటించి చేతులు దులుపుకుంది. ఈ మేరకు రైతుల నుంచి పంటను కొనుగోలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టలేదు. రైతు సేవా కేంద్రాల్లో మద్దతు ధరకు ఇదుగో కొంటున్నాం.. అదిగో కొంటున్నాం అంటూ అధికారులు కూడా కాలయాపన చేస్తున్నారే తప్పా ఇంతవరకు కొన్న దాఖలాలు లేవు. ప్రభుత్వ మాయమాటలతో విసుగెత్తిన రైతులు బహిరంగ మార్కెట్‌లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుని నష్టాలు మూట కట్టుకుంటున్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోలు చేయకపోతే మొత్తం దళారుల పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
ఈ ఏడాది కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా 67,500 ఎకరాలలో 50వేలమంది రైతులు సాగు చేశారు. ఎకరాకు మూడు నుంచి మూడున్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద 2.36 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనే పరిస్థితి కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అక్కడక్కడా కొనుగోలు చేసి అధికారులు మమ అనిపించారు.
బయటి మార్కెట్లో క్వింటాలు కంది రూ.6,200 నుంచి రూ.6,300లోపే పలుకుతోంది. ధర పెరుగుతుందనే ఆశతో కొందరు రైతులు ఇళ్లలోనే పంటను నిలువ చేశారు. జిల్లాలో ఇంకా రైతుల వద్ద లక్ష టన్నులకు పైగా కందులు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
న్యూస్‌రీల్
ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరాశలో కంది రైతులు ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.7550 బహిరంగ మార్కెట్‌లో రూ. 6,200 మించి కొనని దళారులు గతేడాది ఇదే సీజన్‌లో క్వింటా రూ.10వేలు కళ్ల ముందు అప్పులు చేసేది లేక దళారులకు అమ్ముకుంటున్న రైతులు
వారం రోజుల్లో కొనుగోలు
అన్ని రైతు సేవాకేంద్రాలలో కంది పంటను రికార్డు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. కొన్ని గ్రామాల్లో శాంపిల్స్ కూడా పంపగా మార్క్‌ఫెడ్ అధికారులు కూడా చూశారు. మరో వారం రోజుల్లో గ్రామాల్లో రైతుల దగ్గర కంది పంటను కొనుగోలు చేస్తాం –షేక్ అహ్మద్,
మండల వ్యవసాయశాఖాధికారి
అమరావతి
దళారులకు లాభం.. రైతుకు నష్టం
గతేడాది ఇదే సీజన్‌లో కంది క్వింటాలును రూ. 10వేలకు పైగా రైతులపై ఎటువంటి అంక్షలు లేకుండా కొనుగోలు చేశారు.ఈ ఏడాది ఇంతవరకు కొనుగోలు చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో మార్కెట్‌లో తక్కువ రేటుకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఆదనుగా దళారులు రైతుల్ని దోచుకుంటున్నారు. క్వింటాలు రూ. 6200 మధ్య కొనుగోలు చేసినా పలు ఆంక్షలు పెడుతున్నారు. జల్లెడ పట్టి, రవాణా ఖర్చుల పెట్టుకుంటేనే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రైతుకి అదనంగా మరో రూ. 300 నుంచి రూ. 400 ఖర్చు అవుతోంది. దీనివల్ల క్వింటాలు కందులు అమ్మితే రైతులకు రూ. 5,800 నుంచి రూ. 6,000 మాత్రమే చేతికొస్తున్నాయి. ప్రస్తుత ఖర్చులు పోనూ నష్టం తప్పా లాభం లేక అప్పులపాలవుతున్నాడు
రైతులకు
మిగిలేది నష్టమే !
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ధరలు ‘ఆశా’జనకం
ఈ ఏడాది పంట బాగానే పండింది. అయితే మార్కెట్‌లో ధర లేక నష్టం వచ్చే పరిస్థితి ఉంది. రైతు సేవా కేంద్రాలలో ఇప్పటి వరకు కందులు కొనుగోలు చేయడం లేదు. దళారులు క్వింటా రూ. 6300 అడుగుతున్నారు గానీ జల్లెడపట్టి వారి గోడౌన్‌కు తరలించే రవాణా ఖర్చులు కూడా భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన క్వింటా రూ. 6వేలకు మించి రేటు రావడం లేదు
–ఈ. సుధాకరరెడ్డి, కంది రైతు, మునగోడు, అమరావతి మండలం
గత ప్రభుత్వ హయాంలో కంది పంట ధర ఆశాజనకంగా ఉండడంతో జిల్లాలో ఎక్కువ మంది రైతులు సాగుపై మొగ్గు చూపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రధాన వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా గతంలో కంటే జిల్లాలో అంచనాలకు మించి రైతులు కంది సాగు చేశారు.ఈ ఏడాది దిగుబడి ఫర్వాలేదనిపించినా మార్కెట్‌లో పడిపోయిన ధరలు మాత్రం రైతుల నడ్డి విరుస్తున్నాయి. జిల్లాలోని 28 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో కంది పంటను మద్దతు ధరకు కొంటామని ప్రభుత్వం చెబుతున్నా గ్రామస్థాయిలో నెల రోజుల నుంచి కాలయాపన చేయడం తప్పా కొనే నాథుడు కరువయ్యాడు. తేమ ఉందని, ఈ–పంటలో నమోదు చేసుకోలేదని తదితర కుంటి సాకులు చెబుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025