
హత్యకేసులో నిందితుడు అరెస్టు
అమరావతి: మండల పరిధిలోని దిడుగు గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన కానసాని కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుడు గోళ్ల జాలయ్యను అమరావతి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అచ్చియ్య చెప్పిన వివరాల ప్రకారం... కానసాని కోటేశ్వరరావు వద్ద తీసుకున్న అప్పు విషయమై తలెత్తిన వివాదంలో జాలయ్య బండరాయితో మోది ఈ హత్య చేశాడు. జాలయ్యను మండల పరిధిలోని ధరణికోట ఆరుడొంకల బావి సెంటర్‌లో బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం బుధవారం సాయంత్రం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు.
బెల్టు షాపు నిర్వాహకుడిపై కేసు
మండల పరిధిలోని దిడుగు గ్రామంలో ఈ హత్య బెల్టు షాపులో జరగడం కలకలం రేపింది. బెల్ట్‌షాపు నిర్వాహకుడు ఎం.నాగేశ్వరరావుపై మంగళవారం కేసు నమోదు చేశారు. బెల్టు షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 45 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.