
షూటింగ్ బాల్ జిల్లా జట్లు ఎంపిక
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగాయి. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు తోక సోమనాథ్ ప్రారంభించారు. ఎంపికకు బాలుర విభాగంలో 35, బాలికల విభాగంలో 30 మంది హాజరయ్యారు.
● బాలుర జట్టుకు ఎం.మణికంఠ, వి.వర్షిత్, ఎస్.భార్గవ్, జి.నాగ హనుమ, జి.వెంకటేష్, ఎస్. సుధీర్, జి.రంగా, బి గోపి, జి.సురేష్, ఎ.సూర్య, కె.శశి, శనగల భార్గవ్, స్టాండ్ బైలుగా కె. జోసఫ్, పి.ఆనంద్‌లు ఎంపికయ్యారు.
● బాలికల జట్టుకు పి.నందిని, ఎస్.సుస్మిత, ఎం.వీరలక్ష్మి, కె.ఉష, సీహెచ్ సంజన, ఎస్.సింధూర, పి. సులోచన రాణి, సి.చంద్రిక, కె.యశస్విని, ఎల్.మహాలక్ష్మి, కె.వేదవతి, ఎం. కీర్తన, స్టాండ్ బైలుగా ఎ.హేమ శివమణి, కె.వసంత కుమారి ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు ఈ నెల 25, 26వ తేదీలలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, కార్యదర్శి కోనంకి కిరణ్ కుమార్ తెలిపారు.