
పోలీస్ స్టేషన్‌కు బేడీలా...!
పిడుగురాళ్ల: దాచేపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేయడమేంటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా మహిళా యాక్టివిస్ట్‌ను అరెస్టు చేసి అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఉంచటం సరైన నిర్ణయమా అని ప్రశ్నించారు. పార్టీ లీగల్ టీం, నాయకులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా బయట బేడీలు వేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలిని లీగల్ టీం కూడా కలవకుండా అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి