
స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతీ సమితి, భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ టీవీ, కళాంజలి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు మొదలయ్యాయి. ఆలయ పాలక మండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి పుట్ట గుంట ప్రభాకరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఏపీ నాటక అకాడమీ నిర్వాహకులు గుమ్మడి గోపాలకృష్ణ, హంస అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ, ఉగాది పురస్కారగ్రహీత నల్లక శ్రీనివాసరావు, టీవీ. నటుడు, నిర్మాత డాక్టర్ వలేటి అప్పారావు ప్రసంగించారు. ఈనెల 19 వరకు స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు జరుగుతాయని కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం శ్రీదుర్గాభవాని నాట్యమండలి (తెనాలి) ఆధ్వర్యంలో ఆరాధ్యుల ఆదినారాయణరావు నిర్వహణలో శ్రీకృష్ణ తులాబారం, పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. నటీనటులు మెప్పించారు. డోలక్‌పై సాంబిరెడ్డి చక్కటి సహకారాన్ని అందించారు.

స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు ప్రారంభం