
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థి ప్రతిభ
వినుకొండ: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో వినుకొండ విద్యార్థి కాలువ లీల వెంకటసాత్విక్ 99.92 పర్సంటైల్ సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 1276 ర్యాంక్ సాధించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ 985 మార్కులు సాధించారు. సాత్విక్ తండ్రి వెంకటనారాయణ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లి కృష్ణకుమారి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సాత్విక్ మాట్లాడుతూ జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఇండియాలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ కాలేజీల్లో సీటు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సాత్విక్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, అధ్యాపకులు, బంధువులు అభినందనలు తెలిపారు.