
● ఎస్పీ కంచి శ్రీనివాసరావు ● స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్రలో
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరికీ ఆరోగ్యం
నరసరావుపేట: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రతి మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్‘ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి తమ కార్యాలయాల్లో పరిశుభ్రత నిర్వహించారు. సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. పోలీసుస్టేషన్ లోపల, ఆవరణలోనూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఫైళ్లను క్రమపద్ధతిలో ఉంచారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, వెల్ఫేర్ ఆర్.ఐ గోపీనాథ్, ఏ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం
బల్లికురవ: పేలుడు పదార్థాలు నిలువచేసే మ్యాగ్జెయిన్‌లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వేమవరం జంక్షన్ నుంచి గంగపాలెం వెళ్లే రోడ్డుతో పాటు, నాగరాజుపల్లె సమీపంలోప్రసన్నాంజనేయ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన 2300 మ్యాగ్జెయిన్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సంతమాగులూరు సీఐ వెంకట్రావు తెలిపారు. దాడుల్లో బల్లికురవ ఎస్సై వై. నాగరాజు, ఆర్‌ఐ పోతురాజు పాల్గొన్నారు.

● ఎస్పీ కంచి శ్రీనివాసరావు ● స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్రలో