
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత
నాలుగు కేజీబీవీల్లో 100 శాతం ఉత్తీర్ణత
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని ఏపీ మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87 శాతం ఉత్తర్ణత సాధించారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్ల నుంచి 1,072మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 936 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 87.31 శాతంగా ఉంది. అలాగే జిల్లాలోని 24 కేజీబీవీ పాఠశాలల నుంచి 877 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు కాగా, 763 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 87 శాతంగా ఉంది. చిలకలూరిపేట, అచ్చంపేట, నాదెండ్ల, నూజెండ్ల కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
రాజుపాలెం: మండలంలో పదవ తరగతి విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ–1, 2 మల్లిఖార్జునశర్మ, నరసింహరావులు బుధవారం తెలిపారు. మండలకేంద్రంలోని నవోదయ పాఠశాల నుంచి 37 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 34 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. నవోదయ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి శీలం ఈశ్వర్ 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించాడన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా
మాచవరం: మండలంలోని మోర్జంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మూలగుండ్ల సాక్షితారెడ్డి 589 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలో మొత్తం 464 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాగా 334 మంది ఉత్తీర్ణులై 74 శాతం ఉత్తీర్ణత శాతం సాధించినట్లు ఎంఈఓలు డి.శ్రీధర్, ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేమవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని గంగవరపు ప్రణతి 582 మార్కులు సాధించి రెండవ స్థానంలో, మాచవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బద్దిశెట్టి గంగహర్షిత 581 మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
88త్యాళ్లూరు జెడ్పీ పాఠశాలలో..
క్రోసూరు: పదవతరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని 88 త్యాళ్లూరు జెడ్పీ పాఠశాల 93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్‌ఎం వి.లక్ష్మీనారాయణరావు బుధవారం తెలిపారు. పాఠశాలకు చెందిన షేక్ షాహిద్ 587 మార్కులు సాధించాడన్నారు. ఎం.ఊర్మిళ 574, డి.శ్రేయ 572 మార్కులు సాధించినట్లు చెప్పారు.
దూరవిద్యలో 52.65 శాతం ఉత్తీర్ణత
నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి దూరవిద్య పరీక్షా ఫలితాలలో పల్నాడు జిల్లా 52.65 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. పరీక్షకు 1,077మంది విద్యార్థులు హాజరు కాగా 567మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే దూరవిద్య ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో 56.51 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. పరీక్షకు 1,196మంది విద్యార్థులు హాజరు కాగా, 1,128 మంది ఉత్తీర్ణులయ్యారు. దూరవిద్య అభ్యాసకులు రీ కౌంటీంగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 26వ తేదీ నుంచి మే నెల 5 వరకు ఏపీ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. దూరవిద్య అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వతేదీ నుంచి 24 వరకు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు.
బెల్లంకొండ: పది ఫలితాలలో మండలంలో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ బి.రాజకుమారి తెలిపారు. మండలంలో 248 మంది పరీక్షలు రాయగా 210 మంది పాసైనట్లు తెలిపారు. మండలంలోని కేజీబీవీకి చెందిన బి.ప్రసన్న 580 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత

మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత

మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత

మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 87 శాతం ఉత్తీర్ణత