
ఉగ్రదాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
సత్తెనపల్లి: ఉగ్రవాద దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని తాలూకా సెంటర్‌లోని న్యాయస్థాన ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద బుధవారం న్యాయవాదులందరూ సమావేశమై కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పౌరుల ఆత్మకు సద్గతులు కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదులు కశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన పౌరులను లక్ష్యంగా చేసుకొని వారి మతం అడిగిమరీ హిందువులను అతిహేయంగా హతమార్చారన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజవరపు శివనాగేశ్వరావు, సూరే వీరయ్య, రామిరెడ్డి, దివ్వెల శ్రీనివాసరావు, కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, శాస్త్రి, పూజల వెంకట కోటయ్య, చలపతి తదితరులు ఉన్నారు.