
వైద్య కళాశాలలో వెల్‌నెస్ క్లీనిక్ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ఫిజియాలజీ విభాగం వద్ద గురువారం వెల్‌నెస్ క్లీనిక్‌ను ప్రారంభించారు. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, సీనియర్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి వెల్‌నెస్ క్లీనిక్‌ను ప్రారంభించారు. వైద్య కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. కళాశాల అభివృద్ధికి డాక్టర్ సుందరాచారీ చేస్తున్న కృషిని కొనియాడారు. కళాశాలలో వైద్యులు, వైద్య సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించేందుకు వెల్‌నెస్ క్లీనిక్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ తెలిపారు. ప్రతిరోజూ పీజీ వైద్యులు వెల్‌నెస్ క్లీనిక్‌లో అందుబాటులో ఉండి సేవలందిస్తారన్నారు. ఉచిత క్లీనిక్ సేవలను కళాశాల సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.