వీరఘట్టం/పార్వతీపురం టౌన్: ‘ఆవు చేను మేస్తే... దూడ గట్టు మేస్తుందా’ అన్న సామెత మాదిరిగా రాష్ట్రంలో బడాయి బాబు.. లడాయి కొడుకులు సూపర్ సిక్స్ అంటూ ఆరు మోసపూరిత హామీలిచ్చేందుకు వస్తున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజ లకు వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. నారా లోకేశ్ ఈ నెల 13,14 తేదీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పాలకొండ, కురుపాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రశ్నించారు.
ఆనాడు జన్మభూమి కమిటీలు చేసి న దందా, నీరు–చెట్టు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న పాలకుల తీరు, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ చంద్రబాబునాయుడు చేసిన మోసం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను ముంచేసిన టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలనను ఎవరూ మరిచ్చలేదన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ ఏ మొహం పెట్టుకుని పార్వతీపురం మన్యం జిల్లాకు వస్తున్నాడని, కనీసం ఈ ప్రాంత ప్రజలకు మేలుకలిగించే ఒక్క పనైనా టీడీపీ హయాంలో జరిగిందా అంటూ ప్రశ్నించారు.
పాలకొండలో పర్యటించే అర్హత లేదు
పాలకొండలో పర్యటించే అర్హ త టీడీపీ నేత నారా లోకేశ్‌కు లే దు. ఆనాడు నీరు–చెట్టు పేరు తో రూ.కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు. పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లుపట్టుకోవా ల్సి వచ్చేది. టీడీపీ నేతలను నమ్మే రోజులు పోయా యి. ఎవరు ప్రజలకు మేలుచేస్తారో తెలుసు.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ పాలకొండ
ఆయనో మాలోకం
ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఏగిన ట్లు ఉన్నాయి నారా లోకేశ్ మా టలు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 614 హామీలిచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే దు. రైతులకు చెందిన రూ.87 వేల కోట్లు, డ్వాక్రా మహిళల 14వేల కోట్లు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకాన్నీ సరిగా అమలుచేయలేకపోయారు. ఇప్పుడేమో మరిన్ని మోసపూరిత హా మీలిచ్చేందుకు నారా లోకేశ్ వస్తున్నాడు. ఆయనో మాలోకం. ఆయనను ఎవరూ విశ్వసించరు.
– అలజంగి జోగారావు, ఎమ్మెల్యే పార్వతీపురం
ఉచిత హామీలను ప్రజలు నమ్మరు
శంఖారావం పేరిట జిల్లాలో పర్యటించనున్న నారా లోకేశ్ ఇచ్చే ఉచిత హామీలను ఈ ప్రాంతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోటపల్లికి కేవలం రూ.50 కోట్లు నిధులు మాత్రమే మంజూరు చేశారు. తోటపల్లి ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిది. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనుల ఊసెత్తలేదు. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. 2019లో ఎన్నికల స్టంట్‌గా హడావుడిగా తోటపల్లి పనులకు శంకుస్థాపన చేసి అరకొర పనులు చేపట్టి వదిలేశారు. మళ్లీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే.
– పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే కురుపాం
వసరమైతే పాకిస్తాన్‌తోనూ పొత్తు పెట్టుకుంటారు
ఏదో ఓ విధంగా ప్రజలను మోసం చేసి సీఎం అయిపోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. జనసేన, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. అంతర్లీనంగా కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. సిగ్గు లేకుండా బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకున్నారు. ఇంకా అవసరమైతే పాకిస్తాన్‌తో కూడా పొత్తు పెట్టుకునే రకం టీడీపీ నేత చంద్రబాబుది. పొత్తులు పెట్టుకుంటే పదవులురావు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తే ఆ పదవులు వాటంతటవే వస్తాయి. ఈ రోజు నేరు గా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మో హన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టే ప్రజల మన్ననలు పొందుతున్నారు. రానున్న ఎన్ని కల్లో వైఎస్సార్‌సీపీదే విజయం. బడాయి బాబు... లడాయి కొడుకు మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు.
– పీడిక రాజన్నదొర, డిప్యూటీ సీఎం
మా ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పండి
నారా లోకేశ్‌కు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదు. ఎందుకుంటే 2017 సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి హోదాలో వీరఘట్టం మండలం తెట్టంగి వచ్చిన చంద్రబాబు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో కనీసం ఒక్క అభివృద్ధి పనికూడా చేయలేదు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇక్కడ నేను ఉన్నానని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా కక్షకట్టారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఇప్పుడేమో ఆరు హామీలంటూ లడాయి కొడుకు నారా లోకేశ్ ప్రజలను మోసంగించేందుకే వస్తున్నాడు. మీ మోసాలు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు.
– విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment