Pamula Pushpa Sreevani
-
ఆడవాళ్లపై ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపు బాబు
-
అసెంబ్లీలో టీడీపీ మంత్రి వ్యాఖ్యలకు పుష్ప శ్రీవాణి అదిరిపోయే సెటైర్లు
-
షర్మిల పై పుష్ప శ్రీవాణి ప్రశ్నల వర్షం..
-
చంద్రబాబుకు పుష్పశ్రీవాణి అదిరిపోయే కౌంటర్
-
మునుపటి కంటే ఈసారి అధిక శాతం ఓటింగ్
-
పేరు ఆమెది.. పెత్తనం వారిది..!
కోతి గెంతడం..యజమాని వసూలు చేయడం అన్న సామెత చందాన తయారైంది టీడీపీ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం మహిళా అభ్యర్థి పరిస్థితి. ఆమెకు బొట్టు పెట్టి ఎన్నికల బరిలో దింపినా వెనుక నుంచి పెత్తనం, ప్రచారం నడిపిస్తున్నదంతా ఆ పార్టీలోని పెద్దలే. ఈ పరిస్థితికి కారణం ఆమెకు కనీస రాజకీయ అనుభవం లేకపోవడమే. నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించిన వారెవరికీ దక్కకపోవడంతో పోనీలే ఆమెను అడ్డుపెట్టుకుని అయినా పెత్తనం చెలాయించవచ్చన్న ఆలోచనకు వచ్చి తెరవెనుక ఖర్చు చేస్తూ ఎన్నికలు జరగకముందు నుంచే ఆధిపత్యం సాగిస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: మూడు దశాబ్దాలుగా కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది లేదు. ఆ పార్టీ నేతలను నియోజకవర్గం ప్రజలు విశ్వసించే పరిస్థితి కానరాదు. పార్టీలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణి, అధికారం చేజిక్కించుకోవాలనే ఆరాటం వెరసి ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేయడం తప్ప అడవి బిడ్డలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో అడుగడుగునా వైఎస్సార్సీపీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. తమకు మేలు చేసిన జగనన్న ప్రభుత్వమంటే ఇక్కడి గిరిజనుల్లో నమ్మకం గూడు కట్టుకుంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆమె విజయాన్ని అడ్డుకునేందుకు నాడు కత్తులు దూసుకున్న వారంతా ఇప్పుడు చేతులు కలిపారు. గిరిజన మహిళ అనే సానుభూతిని తెరపైకి తెచ్చి..నామ్ కే వాస్తేగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, కొందరు ‘పెద్దలే’ వెనుక నుంచి కథంతా నడిపిస్తున్నారు. ఇందులో వైరిచర్ల, శత్రుచర్ల వర్గాలు ఒకటైతే..మరో బలమైన సామాజిక వర్గం నేతలు మరికొందరు ఉండడం గమనార్హం.రిమోట్ వారి చేతిలోనే..కురుపాం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. గిరిజన ప్రజ లు ఎప్పుడూ ఆ పార్టీని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ దఫా కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడ్డారు. ఆశావహుల్లో వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఒకరు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులతో అంటూ తోయక జగదీశ్వరిని టీడీపీ తరఫున నిలబెట్టారు. ఆమెకు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం మినహా కనీసం మండలస్థాయి నాయకురాలిగానూ పని చేయలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తార ని పెద్ద పంచాయితీయే నడిచింది. మరో వర్గంలోని డొంకాడ రామకృష్ణ, దత్తి లక్ష్మణరావు వంటివారు టికెట్ ఆశించి భంగపడ్డారు. గుమ్మలక్ష్మీపురానికి చెందిన బిడ్డిక పద్మావతి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా సుమారు నాలుగైదు గ్రూపులు టికె ట్ ఆశించాయి. నియోజకవర్గ ఇన్చార్జిగా తోయక జగదీశ్వరిని నియమించిన తర్వాత ఆమైనెనా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుని, పెత్తనం చెలాయిద్దామన్న ఉద్దేశంతో కొంతమంది బాగా ఖర్చు పెట్టి హడావిడి చేశారు. ఇప్పుడు అభ్యర్థిగా జగదీశ్వరి ఉన్నప్పటికీ..వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మొత్తం చూసుకుంటున్నారు. దీనివల్ల ఆమెకంటూ స్వతంత్రత గానీ, ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గానీ కనిపించడం లేదు. ఒకవైపు గిరిజన బిడ్డను ఆదరించాలని కోరుతూనే..మరోవైపు పెత్తనమంతా వీరేష్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు వంటి పెద్దల వద్దే ఉంచుకోవడం ఇప్పుడు గిరిజన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దౌర్జన్యంటీడీపీ నాయకుల దౌర్జన్యాలకు ఇక్కడ కొదవ లేదు. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై జియ్యమ్మవలస మండలానికి చెందిన డొంకాడ రామకృష్ణ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. చినబుడ్డిడి పంచాయతీలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గదిలో నిర్బంధించి తమ అనుచరులతో భయభ్రాంతులకు గురి చేశారు. ఆ ఘటనను నేటికీ నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేదు.నియోజకవర్గానికి టీడీపీ చేసింది శూన్యంరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్య మంత్రిగా చంద్రబాబు చేసింది శూన్యం. తోటపల్లి ప్రాజెక్టు తన వల్లేనంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు..వాస్తవానికి 2003లో తాను పదవి దిగిపో యే నెల ముందు శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తర్వాత 2004లో అధికారంలో వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ దాదాపు రూ.800 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి రోశయ్య పదవీ కాలంలో మరికొంత నిధులను వెచ్చించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి అప్పగిస్తే.. 2014లో ఆగస్టులో చంద్రబాబు హ యాంలో దీన్ని జాతికి అంకితం చేశారు. దీన్ని తన గొప్పగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మళ్లీ తోటపల్లి కాలువల ఆధునికీకరణకు రూ.193కోట్లు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గడిచిన 59 నెలల కాలంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..
-
పేద వర్గాలకు మేలు చేసిన సంక్షేమ ప్రదాత సీఎం జగన్: పుష్ప శ్రీవాణి
-
జగన్ ని ఓడించాలంటే పొత్తులు కాదు బిడ్డా... గుండెల్లో ధైర్యం ఉండాలి
-
బడాయి బాబు.. లడాయి కొడుకు..
వీరఘట్టం/పార్వతీపురం టౌన్: ‘ఆవు చేను మేస్తే... దూడ గట్టు మేస్తుందా’ అన్న సామెత మాదిరిగా రాష్ట్రంలో బడాయి బాబు.. లడాయి కొడుకులు సూపర్ సిక్స్ అంటూ ఆరు మోసపూరిత హామీలిచ్చేందుకు వస్తున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజ లకు వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. నారా లోకేశ్ ఈ నెల 13,14 తేదీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పాలకొండ, కురుపాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రశ్నించారు. ఆనాడు జన్మభూమి కమిటీలు చేసి న దందా, నీరు–చెట్టు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న పాలకుల తీరు, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ చంద్రబాబునాయుడు చేసిన మోసం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను ముంచేసిన టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలనను ఎవరూ మరిచ్చలేదన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ ఏ మొహం పెట్టుకుని పార్వతీపురం మన్యం జిల్లాకు వస్తున్నాడని, కనీసం ఈ ప్రాంత ప్రజలకు మేలుకలిగించే ఒక్క పనైనా టీడీపీ హయాంలో జరిగిందా అంటూ ప్రశ్నించారు. పాలకొండలో పర్యటించే అర్హత లేదు పాలకొండలో పర్యటించే అర్హ త టీడీపీ నేత నారా లోకేశ్‌కు లే దు. ఆనాడు నీరు–చెట్టు పేరు తో రూ.కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు. పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లుపట్టుకోవా ల్సి వచ్చేది. టీడీపీ నేతలను నమ్మే రోజులు పోయా యి. ఎవరు ప్రజలకు మేలుచేస్తారో తెలుసు. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ పాలకొండ ఆయనో మాలోకం ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఏగిన ట్లు ఉన్నాయి నారా లోకేశ్ మా టలు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 614 హామీలిచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే దు. రైతులకు చెందిన రూ.87 వేల కోట్లు, డ్వాక్రా మహిళల 14వేల కోట్లు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకాన్నీ సరిగా అమలుచేయలేకపోయారు. ఇప్పుడేమో మరిన్ని మోసపూరిత హా మీలిచ్చేందుకు నారా లోకేశ్ వస్తున్నాడు. ఆయనో మాలోకం. ఆయనను ఎవరూ విశ్వసించరు. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే పార్వతీపురం ఉచిత హామీలను ప్రజలు నమ్మరు శంఖారావం పేరిట జిల్లాలో పర్యటించనున్న నారా లోకేశ్ ఇచ్చే ఉచిత హామీలను ఈ ప్రాంతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోటపల్లికి కేవలం రూ.50 కోట్లు నిధులు మాత్రమే మంజూరు చేశారు. తోటపల్లి ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిది. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనుల ఊసెత్తలేదు. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. 2019లో ఎన్నికల స్టంట్‌గా హడావుడిగా తోటపల్లి పనులకు శంకుస్థాపన చేసి అరకొర పనులు చేపట్టి వదిలేశారు. మళ్లీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తున్న ఘనత జగన్మోహన్రెడ్డిదే. – పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే కురుపాం వసరమైతే పాకిస్తాన్‌తోనూ పొత్తు పెట్టుకుంటారు ఏదో ఓ విధంగా ప్రజలను మోసం చేసి సీఎం అయిపోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. జనసేన, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. అంతర్లీనంగా కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. సిగ్గు లేకుండా బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకున్నారు. ఇంకా అవసరమైతే పాకిస్తాన్‌తో కూడా పొత్తు పెట్టుకునే రకం టీడీపీ నేత చంద్రబాబుది. పొత్తులు పెట్టుకుంటే పదవులురావు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తే ఆ పదవులు వాటంతటవే వస్తాయి. ఈ రోజు నేరు గా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మో హన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టే ప్రజల మన్ననలు పొందుతున్నారు. రానున్న ఎన్ని కల్లో వైఎస్సార్సీపీదే విజయం. బడాయి బాబు... లడాయి కొడుకు మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు. – పీడిక రాజన్నదొర, డిప్యూటీ సీఎం మా ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పండి నారా లోకేశ్‌కు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదు. ఎందుకుంటే 2017 సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి హోదాలో వీరఘట్టం మండలం తెట్టంగి వచ్చిన చంద్రబాబు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో కనీసం ఒక్క అభివృద్ధి పనికూడా చేయలేదు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇక్కడ నేను ఉన్నానని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా కక్షకట్టారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఇప్పుడేమో ఆరు హామీలంటూ లడాయి కొడుకు నారా లోకేశ్ ప్రజలను మోసంగించేందుకే వస్తున్నాడు. మీ మోసాలు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే పాలకొండ -
పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో బస్సు యాత్ర
-
జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
-
వైఎస్ఆర్సీపీ సైనికులకు పెద్ద పండగ: పుష్ప శ్రీవాణి
-
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి
సాక్షి, పార్వతీపురం: పదవి వచ్చిందని ఏనాడూ విర్రవీగలేదు.. పదవి లేదనే నిరాశా లేదు.. నిరంతరం ప్రజాసేవే లక్ష్యం.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కర్తవ్యమని కురుపాం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. చిన్నమేరంగి గ్రామంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పాలన, గిరిజన శాఖ మంత్రిగా ఆమె సాధించిన విజయాలు ఆమె మాటల్లోనే... సాక్షి: రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఎలా ఉంది ? పుష్పశ్రీవాణి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంక్షేమం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాలకు సీఎం జగన్మోహన్రెడ్డి సున్నావడ్డీ పథకం కింద మూడో విడత వడ్డీ నగదును జమచేయించారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, దిశ చట్టంతో మహిళా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత ఆయనదే. సాక్షి : గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీరు సాధించిన ఫలితాలు ? పుష్పశ్రీవాణి : మన్యం జిల్లాకు గిరిజన ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయించాను. రూ.105 కోట్లు మంజూరయ్యాయి. పాడేరులో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాం. 1.60 లక్షల మంది గిరిజనులకు పోడు వ్యవసాయ సాగు పట్టాలు అందించాం. డీబీటీ, నాన్ డీబీటీ విధానం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపంలో రాష్ట్రంలోని గిరిజనులకు రూ.931 కోట్లు నిధులు వెచ్చించాం. సంక్షేమ పథకాలతో 49 లక్షలు మంది గిరిజనులు లబ్ధిపొందారు. సాక్షి : రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉంటాయి ? పుష్పశ్రీవాణి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయం. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ శాతశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కింది. ప్రజా సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పథకాలతో ప్రజలను ఆదుకున్నారు. టీడీపీ నేత చంద్రబా బు నాయుడిపై ప్రజలకు నమ్మకం లేదు. ఆయన మాయమాటలకు మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారన్నది అందరికీ తెలిసిన నిజం. అందు కే.. గతంలో వచ్చిన 23 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ దఫా వచ్చే పరిస్థితి లేదు. సాక్షి : పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక? పుష్పశ్రీవాణి : క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిని తెలియజేస్తాం. సచివా లయాలు ఏర్పాటు, ఉద్యోగ కల్పన, వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు, కోవిడ్ నియంత్రణ సమయంలో ప్రజలకు అందించిన సేవలు, ఠంచన్‌గా అందిస్తున్న పింఛన్, ఇళ్ల స్థలాలు మంజూరు వంటివి ప్రజలకు వివరిస్తాం. అర్హులకు సంక్షేమ పథకాలను అందించిన ఘనతను గుర్తుచేస్తాం. గతంలో కంటే ఎక్కువ మందిని వైఎస్సార్సీపీ కుటుంబీకులుగా చేర్చుతాం. 2024 ఎన్నికల్లో ఎదురులేని విజయాన్ని అందుకుంటాం. సాక్షి : పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం ఎలా అనిపిస్తోంది? పుష్పశ్రీవాణి: అధికారంలో ఉన్న పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందడం అంటే ఆషామాషీ కాదు. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్నటివరకూ రాష్ట్ర మంత్రిగా సేవలు అందించాను. ఇప్పుడు పా ర్టీ అధ్యక్షరాలిగా పార్టీకి సేవచేసే అదృష్టం రావడం సంతోషదాయకం. సీఎం నమ్మకంతో కట్టబెట్టిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. -
ఆ ఘనత సీఎం జగనన్నదే: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
తన నివాసంలో కూరగాయలు సాగు చేస్తున్నపుష్ప శ్రీవాణి
-
‘మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం’
సాక్షి, అమరావతి: మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశారన్న డిప్యూటీ సీఎం.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. -
‘కట్టే కాలేవరకు వైఎస్సార్ సీపీలోనే’
సాక్షి, కురుపాం: జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం గడ్డ.. వైఎస్సార్ కుటుంబానికి అడ్డ అని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... ‘వైఎస్సార్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు. అధికార పార్టీ నన్ను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించింది. నా చేతిపై వైఎస్సార్ పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మన సమస్యలు జగనన్న పరిష్కరిస్తారు. కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం మేము దేనికైనా రెడీ’ అని పుష్పశ్రీవాణి అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురించి లొంగకుండా ఉన్న పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి అన్నారు. విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని విమర్శించారు.. -
మీ కష్టాల్లో అండగా ఉంటా...
గుమ్మలక్ష్మీపురం : భారీ ఈదురు గాలుల వల్ల ఇళ్లు నష్టపోయిన బాధితులందరికీ అండగా ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భరోసా ఇచ్చారు. ఈ నెల 18 అర్థరాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గ్రామానికి చెందిన 18 మంది గిరిజనుల రేకిళ్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి పాఠకులకు విదితమే. ఈ సమాచారం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే ఆదివారం మధ్యాహ్నం వండిడి గ్రామాన్ని సందర్శించి ఇళ్లు నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులంతా ఈదురు గాలులు సృష్టించిన బీభత్సంపై ఎమ్మెల్యే ముందు విన్నవించారు. సుమారు 19 ఏళ్ల కిందట తమకు రేకులు ఇచ్చారని, ఈ గాలుల వల్ల అవి ఎగిరిపోయి పాడవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్వతీపురం ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లి, నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతానన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పాఠశాల భవన నిర్మాణం అర్థాంతరంగా ఉందని, ఆ భవనం నిర్మాణానికి కూలీ పనులకు వెళ్లిన తమకు నేటికీ కూలీ సొమ్ములు కూడా ఇవ్వలేదని, రహదారి సమస్య అలాగే ఉందని ఎమ్మెల్యే వద్ద ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, నాయకులు తోయక మాధవరావు, నిమ్మక గోపాల్, తాడంగి పాపారావు, కడ్రక వెంకటరావు, సునీల్ తదితరులు ఉన్నారు. -
భూమా నాగిరెడ్డి అరెస్టు అన్యాయం
కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి జియ్యమ్మవలస: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ అన్యాయమని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె ఆదివారం చినమేరంగిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమాను అరెస్టు చేయడం దారుణమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాగిరెడ్డిని కనీసం వైద్యం కోసం హైదరాబాద్ పంపమని అభ్యర్థించినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో అక్రమాలు చేసి సంపాదించిన డబ్బు తో తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. -
గిరిజన వర్సిటీ తరలింపు బాధాకరం
జియ్యమ్మవలస:జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించడం బాధాకరమని కురుపా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మం డలంలోని చినమేరంగి గ్రామంలో తన స్వగృహంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, ప్రస్తుతం మాట తప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామంటే ఈప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రస్తుతం తరలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. జిల్లా నుంచి ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని వారంతా పట్టించుకోక పోవడం వింతగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మాటలే తప్ప చేతలు లేవన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హమీలను నెరవేర్చి గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఈ జిల్లాలోనే స్థాపించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. నాయకులకు బుద్ధి చెబుతాం: గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు విజయనగరం కంటోన్మెంట్: జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన నాయకులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ సురేష్, కె నాగేశ్వరరావులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని వాపోయారు. ఎంతో వెనుకబడ్డ ఈ జిల్లా గిరిజన యూనివర్సిటీ రాకతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుతుంటే గిరిజనులు మాత్రం ప్రాథమిక విద్యకు కూడా నోచుకోకుండా ఇక్కడే గిరిగీసినట్టుండిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గిరిజనులు సొంత కాళ్ల మీద నిలబడడానికి ఉన్నత విద్యలు అవసరమని, అందుకు ఈ గిరిజన విశ్వవిద్యాలయం వస్తే ఎంతో అనుకూలంగా ఉండేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును జీర్ణించుకోలేకపోతున్నామని అందుకోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే విశాల ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు.