టమాటో
@
వీరఘట్టం: నిన్న, మొన్నటి వరకు ఆకాశాన్నంటిన టమాటో, కాలిఫ్లవర్ ధరలు అమాంతం పతనమయ్యయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ టమాటో కొనేవారు కరువవడంతో వీరఘట్టంలో పంట పొలాల వద్ద రైతులు టమాటోను పారబోస్తున్నారు. వీరఘట్టం మార్కెట్‌లో కిలో టమాటో రూ.20లు పలుకుతున్నా..పంట పొలాల వద్ద హోల్‌సేల్‌గా కిలో రూ.5 కు కూడా కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. అలాగే కాలిఫ్లవర్ పంట దిగుబడి బాగా వచ్చినా గిరాకీ లేకపోవడంతో కోయకుండా పొలంలోనే రైతులు వదిలేస్తున్నారు.పెళ్లిళ్ల సీజన్ కావడంతో టమాటో, కాలిఫ్లవర్ పంటలకు మంచి గిరాకీ ఉంటుందని అనుకుంటే ఈ పంటలకు డిమాండ్ తగ్గడంతో ధర పతనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
టమాటో పతనం..కాలిఫ్లవర్ ఖతం
అమాంతం పడిపోయిన ధరలు
పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు
టమాటో
టమాటో
Comments
Please login to add a commentAdd a comment