నిర్వాసితులకు రెట్టింపు పరిహారం
వేపాడ: పెందుర్తి– బౌడారా– 516బి రోడ్డు విస్తరణ లో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితుల కు రెట్టింపు పరిహారం అందజేస్తున్నట్టు ఆర్డీఓ దాట్ల కీర్తి తెలిపారు. తహసీల్దార్ రాములమ్మ నేతృత్వంలో బొద్దాం, పాటూరులో నిర్వాసితులతో సోమవా రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వాసితు ల జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహా రం అందజేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ భూములకు సెంటుకు రూ. 26,500, వ్యవసాయేత ర స్థలాలకు గజానికి రూ.6 వేలు చొప్పున పరిహా రం అందజేస్తామన్నారు. బొద్దాంలో 130, పాటూరులో 30 మంది నిర్వాసితులను గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్ సన్యాసినాయుడు, ఆర్‌ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ పెద్దలు కొట్యాడ రమణమూర్తి, ద్వారపూడి గంగునాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment