బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190
జీడి, మామిడి తోటలు దగ్ధం
వేపాడ: మండలకేంద్రం వేపాడ రెవెన్యూ పరిధి రాయుడుపేట రహదారిని ఆనుకుని ఉన్న జీడిమామిడి, మామిడి తోటలు మంగళవారం సాయంత్రం దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎస్.కోట అగ్నిమాపకసిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గ్రామానికి చెందిన గుత్తి గుణవతి, సత్యవతి, మోహన్, శ్రీను, సింహచలం తదితరులకు సంబంధించిన జీడిమామిడి, మామిడి తోటలు సుమారు నాలుగున్నర ఎకరాలు కాలిపోయాయి. కార్యక్రమంలో ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది పైర్ ఆఫీసర్ ఎస్.కె.మదీనా, ఆర్‌వెంకటరావు, వై.నర్సింగరావులు పాల్గొన్నారు.
బాంబ్ బ్లాస్టింగ్‌లో వ్యక్తి మృతి
భోగాపురం: ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా జరిపిన బాంబ్ బ్లాస్టింగ్‌లో ఒక వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందిదాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామచంద్రపేట గ్రామానికి చెందిన బోర కొత్తయ్య(35) విమానాశ్రయం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కవులవాడ సమీపంలో రోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు బాంబులను ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ చేశారు. ఈ బ్లాస్టింగ్‌లో కొత్తయ్య ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది గాయపడిన కొత్తయ్యను తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఎర్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
పార్వతీపురంటౌన్: పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దంగిడి వీధికి చెందిన గెంబలి కాంతారావు పనుల నిమిత్తం పార్వతీపురం పట్టణం పాతబస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి పాలకొండ రోడ్డుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కాంతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు జిల్లా అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఐదు లీటర్ల సారా పట్టివేత
వేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట సమీపంలో దాడులు నిర్వహిస్తుండగా వావిలపాడు గ్రామానికి చెందిన వి.దేముడు ఐదు లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎకై ్సజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వీఎన్ రాజు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న సారా క్యాన్ స్వాధీనం చేసుకునం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైతో పాటు సిబ్బంది సచివాలయం కార్యదర్శి టి.వెంకటేష్ పాల్గొన్నారు.
18 మద్యం బాటిల్స్ స్వాధీనం
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం సంత వద్ద అక్రమంగా 18 మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్సై జయంతి తెలిపారు. మద్యం షాపు నుంచి అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్నాడని సమాచారం రావడంతో నిఘా పెట్టి ఆ వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
చికెన్
చికెన్
చికెన్