విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటలోని మహరాజా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సంకల్ప మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యార్హతలుగల 1,542 మంది అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకాగా వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షలలో ప్రతిభ చూపిన 546 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. మరో 72 మందిని తదుపరి రౌండ్‌కు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ జి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. దాదాపు 26 ప్రముఖ బహుళజాతి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేశాయని, ఎంపికై న వారికి నెలకు రూ.13,000 నుంచి రూ.60,000 వరకు జీతాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎ.అరుణ్, కళాశాల ప్రిన్సిపాల్ బీఎస్‌ఎస్‌రాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్‌మెంట్ అధికారి టి.భాస్కర్, ఎంప్లాయిమెంట్ యంగ్ ప్రొఫెషనల్ యశ్వంత్ సీడాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
546 మందికి లభించిన
ఉద్యోగావకాశాలు