ట్రూఅప్, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ108 శ్రీ186 శ్రీ196
విజయనగరం గంటస్తంభం: సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, సెకి విద్యుత్ ఒప్పందం రద్దు డిమాండ్లతో శుక్రవారం విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు.
‘విద్యుత్ సాకులు’ అనే పుస్తకాన్ని విజయనగరం కోట జంక్షన్ వద్ద కార్మికులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచమని చెబుతూనే, ట్రూఅప్ చార్జీల పేరుతో ఇప్పటికే రూ.17 వేల కోట్లు ప్రజలపై భారం వేసిందన్నారు. మళ్లీ సెకి ఒప్పందం ప్రకారం విద్యుత్ భారాలు ప్రజలపై వేయడం దుర్మార్గమని, తక్షణమే సెకి ఒప్పందం, ట్రూఅప్ విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ ప్రజాపోరాటం జరగనుందని హెచ్చరించారు. విద్యుత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేసీ్త్ర రాజు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా