వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణ వెనక్కి తీసుకోవాలి
● కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కరీం
విజయనగరం ఫోర్ట్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వక్ఫబోర్డ్ చట్టాల సవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖబరస్థాన్ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగమే చట్టసవరణ చేయడమని ఆరోపించారు. చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు టీడీపీ సెక్యులర్ పార్టీ అంటారని, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును ఆయన వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌కే. సమీర్, ఎ.రహమాన్, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాన
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాన శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల మండలంలోని సీతారామునిపేట గ్రామానికి చెందిన ఆయన గతంలో టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి కృతజ్నతలు తెలిపారు.
వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణ వెనక్కి తీసుకోవాలి