
ఎరుకులపేటలో నారాయణమూర్తి సందడి
గజపతినగరం రూరల్: ిసనీ హీరో, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి గజపతినగరం మండలం పాతబగ్గాం పంచాయతీ పరిధిలోని ఎరుకులపేటలో మంగళవారం సందడి చేశారు. గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటుడు, రేలారేరేలా గాయకుడు రఘు ఇంటికి వచ్చారు. త్వరలో తాను తీస్తున్న నూతన సినిమాలో రఘుతో పాట పాడించడంతో పాటు చిన్నపాటి పాత్రను పోషించడంపై చర్చించేందుకు వచ్చినట్టు నారాయణమూర్తి తెలిపారు. ఆయనను చూసేందుకు గ్రామంలోని మహిళలు, చిన్నారులు గుమిగూడారు. సెల్ఫీలు దిగారు. అందరూ బాగుండాలి అంటూ ఆయన గ్రామస్తులను దీవించి అక్కడ నుంచి బయలు దేరారు.

ఎరుకులపేటలో నారాయణమూర్తి సందడి