సాక్షి,పెద్దపల్లి: పోలింగ్ గడువు ఒకవైపు తరుముకొస్తోంది.. మరోవైపు చలికాలం ఎమ్మెల్యే అభ్యర్థులను కష్టాలకు గురిచేస్తోంది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి వారిని ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు నానా పాట్లుపడుతున్నారు. ఉదయం 6గంటలకే ప్రచారం ప్రారంభిస్తూ, రాత్రి పొద్దుపోయేదాక ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రాత్రివేళల్లో రహస్య మంతనాలు సాగిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పక్రియ ముగిసి, పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ముందుకెళ్తున్నారు. గ్రామం నుంచి ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లినవారి గురించి ఆరా తీస్తూ పోలింగ్ నాటికి ఇక్కడకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
జనం ఉన్నచోటుకే ..
● ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరికోతలు జోరందకున్నాయి.
● గ్రామీణ ప్రజలు పొలం పనులకు వెళ్తున్నారు.
● మరికొందరు ఉపాధి కోసం తోటలు వేరడానికి, ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు.
● దీంతో చాలాప్రాంతాల్లో ఉదయం ఊళ్లో ఎవరూ ఉండటం లేదు.
● అభ్యర్థులు సైతం ఉదయమే ప్రచారం నిర్వహించేలా చూసుకుంటున్నారు.
● దీంతో ఓటర్లు ఉన్నవ్యవసాయ పనులు, వందరోజుల పనిచేసే ప్రాంతాలకు వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
● ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయటం కంటే జనం ఎక్కడ ఎక్కువ జమైతరో అక్కడకే వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
● ఎన్నికల్లో గెలుపోటములు స్వల్ప ఓట్లతోనే ముడిపడి ఉండటంతో ప్రతీ ఓటరును కలిసేలా ప్రచారం చేస్తున్నారు.
● వీరి అభ్యర్థనకు ఓటర్లు కూడా సానూకూలంగా స్పందిస్తున్నారు.
● అలాగే ప్రతీఓటరును పోలింగ్ సమయానికి గ్రామానికి రప్పించే బాధ్యతలను ప్రత్యేకంగా తమ సమీప నేతలకు అప్పగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment