కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ వంశీకృష్ణ
గోదావరిఖని: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో బుధవారం కలిశారు. పత్తి కొనుగోళ్లలో సమస్యలు లేకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను సంప్రదించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాల్సిందిగా కోరారు. స్పందించిన కేంద్రమంత్రి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్‌కుమార్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా సూచించారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, న్యాయమైన ధరలు, సమయానికి కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
సుల్తానాబాద్: ఆయుష్మాన్ భారత్ వైద్యులు ఉదయం వేళలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని యాదవనగర్ ఆయుష్మాన్ భారత్ సెంటర్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా వైద్యులు గైర్హాజరు అయితే.. ప్రజలకు సర్కారు వైద్యంపై నమ్మకం పోతుందని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని మందలించారు. ఆయుష్మాన్ భారత్ సెంటర్‌లో ఉదయం పూట వైద్యులు అందుబాటులో ఉంటే రోగులు వైద్యసేవలను వినియోగించుకుంటారని అన్నారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకం
ధర్మారం: శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటంలో ఛత్రపతి శివాజీ పోరాటం మరువలేనిదని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శివాజీ పోరాటం, సూచనలు యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. యువత ప్రభుత్వ పథకాల అమలులో పాలుపంచుకోవాలని సూ చించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, మాజీ సర్పంచు బద్దం సుజాత, మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్‌పాల్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
ఎలిగేడు: పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఎలిగేడులోని శ్రీభవాని రామలింగేశ్వరాలయంలో బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు ప్రతీ ఓటరును కలిసి తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయాలని సూచించారు. సురభి నవీన్‌కుమార్, గాదె రంజిత్‌రెడ్డి, అడ్డగుంట తిరుపతిగౌడ్, గుజ్జుల మల్లారెడ్డి, రాయపాక మనోహర్, మల్లారపు అంజయ్య, ఇల్లందుల పరశురాములు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ వంశీకృష్ణ
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ వంశీకృష్ణ
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment