సింగరేణి స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్
యైటింక్లయిన్‌కాలనీ: సంస్థ చరిత్రలో మొదటిసారిగా సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రారంభించనున్నారు. సంస్థ ఆధ్వర్యంలో తొమ్మిది పాఠశాలలు నడుస్తుండగా.. రామగుండం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి పాఠశాలను ఎంపిక చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ ప్రారంభించాలని సీఎండీ బలరాం ఆదేశించారు. దీంతో పాఠశాలను నూతన హంగులతో తీర్చిదిద్దారు. రూ.5కోట్లతో సకల సౌకర్యాలు కల్పించారు. ప్రతీ తరగతి గదిలో డిజిటల్ బోర్డ్, డిజిటల్ తరగతుల బోధన, ఆధునిక సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. దివ్యాంగులైన విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేందుకు రోప్ వసతి, వాష్‌రూమ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో పాఠాలు బోధిస్తారు. 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్టేట్ సిలబస్‌లోనే పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు రెండేళ్ల తరువాత విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సీబీఎస్‌ఈ పద్ధతిలోనే నిర్వహిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించడం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. నూతన ఉపాధ్యాయుల నియామకం సైతం చేపడుతున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారి
రూ.5 కోట్లతో సౌకర్యాల కల్పన
ఏర్పాట్లు చేస్తున్నాం
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్ అందించేందుకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో డిజిటల్ విద్యా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ.. సంసిద్ధం చేస్తున్నాం.
– సుందర్‌రావు, పాఠశాల హెచ్‌ఎం
సింగరేణి స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్
సింగరేణి స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్
సింగరేణి స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్
Comments
Please login to add a commentAdd a comment