రోడ్డు విస్తరణ పనులపై ఆరా
● లక్ష్మీనగర్‌లో పర్యటించిన అదనపు కలెక్టర్ అరుణశ్రీ ● స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మెప్మా ఆర్పీలకు అవగాహన
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో రోడ్ల విస్తరణ, పురోగతిలోని అభివృద్ధి పనుల తీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ ఆరా తీశారు. బుధవారం నగరంలోని 48, 42, 50వ డివిజన్ల పరిధిలోని లక్ష్మీనగర్, కల్యాణ్‌నగర్‌లో పురోగతిలో ఉన్న రోడ్ల వెడల్పు, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, నీటి సరఫరా పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్ పనులను పరిశీలించారు. 6, 7వ డివిజన్లలోని ఐబీకాలనీ, సప్తగిరి కాలనీ, వవర్ హౌజ్‌కాలనీలో వరద కాలువ పనులను పరిశీలించారు. తిలక్‌నగర్‌లో మణిచంద్ర మహిళా స్వశక్తి సంఘం బ్యాంక్ లింకేజ్ రుణం పొంది, ఎంబ్రాయిడరీ కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి యూనిట్‌ను సందర్శించి నిర్వాహకులకు అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పౌర స్పందన ప్రాధాన్యంపై మెప్మా ఆర్‌ర్పీలకు అవగాహన కల్పించారు. నగరం మెరుగైన ర్యాంక్ సాధించడానికి ఆర్పీలు సహకరించాలని కోరారు. అర్హులైన వారిని గుర్తించి కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, సునీల్ రాథోడ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టౌన్ మిషన్ కో–ఆర్డినేటర్ మౌనిక తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment