
పొరపాట్లు లేకుండా పోలింగ్
● పకడ్బందీగా విధులు నిర్వహించాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎ మ్మెల్సీ ఎన్నికలను పొరపాట్లు తలెత్తకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సామగ్రిని అధికారులు, సిబ్బందికి అందించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు, సిబ్బంది ని బంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలో దాదాపు 31 వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని, వారు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు 36 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 1,100 మంది ఉపాధ్యాయులు ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారికోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని చల్లనినీరు, టెంట్ లాంటి సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఓటర్లు గురువారం జరిగే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఏవో ఆదిరెడ్డి, ఆర్టీవో రంగారావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment