తొలిసారి వేస్తున్నా
నేను ప్రైవేటు ఉపాధ్యాయుడిని. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఓటేయబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. రోజు చాలా వాయిస్‌కాల్స్ వచ్చాయి. అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కరించే వారికే నా ఓటు. ప్రతీ ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి.
– నవక్రాంత్‌రెడ్డి
గోడు విన్న వారికే
తొలిసారి ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఓటుహక్కు కల్పించింది. మా గోడు చెప్పుకునే అవకాశం దక్కింది. ఇన్ని సంవత్సరాలు మమ్ముల్ని ఎవరూ పట్టించుకోలేదు. చాలీచాలనీ జీతాలతో నానా తంటాలు పడుతున్న మాకు దారి చూపించే వారికే నా ఓటు.
– వి.తిరుపతిరావు
అవగాహన ఉన్నవారికి
ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వారికి ఓటేయ్యాలి. నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యలు పరిష్కరించేవారిని ఎన్నుకోవాలి. ప్రజలతో మమేకమైనవారికే నా ఓటు.
– డి. శ్రీనివాస్
సమస్యలపై స్పందించే వారికే
సమస్యలపై స్పందించి, పరిష్కరించే వారికే నా ఓటు. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. ఓటును నోటుతో కొనాలన్నది నేటి రాజకీయం. మన ఓటు వజ్రాయుధం లాంటిది. నోటుకు ఆశపడకుండా ఓటు వేసే విధంగా సిద్ధం కండి.
– అనూప్ కుమార్
తొలిసారి వేస్తున్నా
తొలిసారి వేస్తున్నా
తొలిసారి వేస్తున్నా
Comments
Please login to add a commentAdd a comment