విధుల్లో సాటి.. క్రీడల్లో మేటి
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ ప రిధిలోని పలువురు పోలీసు క్రీడాకారులు రాష్ట్రస్థా యి పోలీస్ మీట్‌లో సత్తాచాటి రాష్ట్రం తరఫున జా తీయస్థాయి పోలీస్‌మీట్‌కి అర్హత సాధించారు. తీరక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో ప్రతిభ చా టుతున్నారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీలు క రీంనగర్ జిల్లా కేంద్రంలో జనవరి–28 నుంచి ఫి బ్రవరి ఒకటో తేదీ వరకు జరిగాయి. రామగుండం కమిషనరేట్ పోలీసులు ఇందులో సత్తా చాటారు. ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్ ఆధ్వర్యంలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. మార్చి 7 నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి కాళేశ్వరం జోన్‌లో అత్యధిక మెడల్స్ సాధించి ముందంజలో నిలిచారు. మొత్తం 48 మెడల్స్ రాగా గోల్డ్‌మెడల్స్–11, సిల్వర్ మెడల్స్–15, బ్రాంజ్ మెడల్స్–21, ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన పోలీసు క్రీడాకారులను పలువురు అభినందించారు.
క్రీడా పోటీల్లో పోలీసుల ప్రతిభ
జాతీయస్థాయికి ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment