కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాముతో కలిసి కార్మికుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను యాజమా న్యం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఢిల్లీలో ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రమకు తగిన వేతనాలు అందజేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని యా జమాన్యాన్ని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకా రం రావాల్సిన అలవెన్స్‌లు చెల్లించాలని, ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులపై పనిభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయ న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టబోయిన రాజ్‌కుమార్, కందుల సతీశ్, శంకర్, మల్లేశ్, రమేశ్‌రెడ్డి, ఎరుకల అంజి, దాత శ్రీనివాస్, దూస రాజేశ్, జనగామ శ్రీనాథ్, కుమార్, శ్రీనివాస్, తరుణ్ పాల్గొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తాం
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment