దర్జీల బతుకు దుర్భరం
పెద్దపల్లిరూరల్: ఆధునిక పోకడలతో దర్జీల బతుకులు దుర్భరంగా మారాయని, పట్టెడన్నం కోసం పడరానిపాట్లు పడాల్సిన వస్తోందని మేరు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కీర్తి రాజయ్య మేరు ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్స్‌డే సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెడీమేడ్ దుస్తులు మార్కెట్‌లోకి రావడంతో దర్జీలకు కుట్టేపని కరువైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో దర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. రాయితీ రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు శంకరయ్యను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మొలు గూరి అశోక్, రమేశ్, కీర్తి నవీన్, లింగయ్య, జితేందర్, నర్సింగం, రాపర్తి రమేశ్, శ్రీనివాస్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బూడిద టిప్పర్ల అడ్డగింత
రామగుండం: మల్యాలపల్లి గ్రామ శివారులోని ఎన్టీపీసీ డ్యాంకు వెళ్లే రహదారిపై ద్విచక్రవాహనదారులు శుక్రవారం వేకువజామున బూడిద టిప్పర్లను అడ్డుకున్నారు. ఎల్కలపల్లి శివారులోని బూడిద చెరువు నిండిపోవడంతో టిప్పర్ల ద్వారా డ్యాంకు వెళ్లే రోడ్డు నుంచి రాజీవ్ రహదారికి టిప్పర్ల ద్వారా బూడిద తరలిస్తున్నారు. అయితే, డ్యాంలో సోలార్ ప్లేట్ల పర్యవేక్షణ చేసే సుమారు 120 మంది కార్మికులతోపాటు ఇటీవల నూతన ప్లాంట్‌లో విధులు నిర్వహించే 300 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. బూడిద లోడుతో వందలాది టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండంతొ బూడిద లేచి పడుతోందని, దీంతో తాము ప్రమాదాలకు గురవుతున్నామని కార్మికులు ఆరోపించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ప్రమాదకరంగా గ్రిల్స్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే ప్రధాన ముఖద్వారం గేటు ఎదుట ఏర్పాటు చేసిన పాత్‌వే గ్రిల్స్ ప్రమాదకరంగా మారాయి. గ్రిల్స్‌కు అమర్చిన పైపులు విరిగిపోవడంతో వాటి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చింది. దీనిని గమనించకుండా పైపులపై నుంచి నడుకుంటూ వెళ్లేవారు ఆ సందుల్లో పడి కాళ్లు విరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి గతంలో కూడా చాలామంది బాధితులు గ్రిల్స్ మధ్య కాళ్లు ఇరుక్కుని కాళ్లు విరగొట్టుకున్నారు. పోలీసులు, స్థానికులు శ్రమించి గ్యాస్ కట్టర్‌తో పైప్‌లను కట్‌చేసి బాధితులను రక్షించిన సంఘటనలు ఉన్నాయి. నిత్యం ఇదే గ్రిల్స్ పైనుంచి రాకపోకలు సాగిస్తున్న అధికారులు.. నివారణ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా మరో ప్రమాదం చోటుచేసుకోకముందే స్పందించాల్సిన అవసరం ఉంది.
అందరూ హిందీ నేర్చుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): అందరూ హిందీ నేర్చుకోవాలని ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ చందన్ కుమార్ సావంత కోరారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో హిందీ దివస్ సందర్భంగా ఇటీవల పలు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు శుక్రవారం ప్రాజెక్టు పరిపాలనా భవనంలో సీజీఎం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఎన్టీపీసీ టీటీఎస్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెర్కారి శ్రీధర్‌రావుకు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ, ఉద్యోగులు, సిబ్బంది హిందీ భాష నేర్చుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమన్వయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం(హెచ్‌ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
దర్జీల బతుకు దుర్భరం
దర్జీల బతుకు దుర్భరం
దర్జీల బతుకు దుర్భరం
Comments
Please login to add a commentAdd a comment