వివాహాల నమోదు అంతంతే..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వివాహాల నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. వివాహాల రిరస్ట్రేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. పల్లెవాసులు అటువైపు పెద్దగా మొగ్గుచూపడం లేదు. అధికారులు సరైన అవగాహన కల్పంచకపోవడమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇదేసమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంల్లో అత్యధికంగా వివాహాలు నమోదు కావడం గమనార్హం.
బాల్య వివాహాలకు ఆడ్డుకట్ట వేసేందుకు..
గ్రామాల్లో బాల్య వివాహాలకు ఆడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2002లో వివాహ నమోదు చట్టంలో జీవో నంబరు 193 ప్రకారం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వివాహ నమోదు బాధ్యతను పంచాయతీ కార్య దర్శులకు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. అంతేగాకుండా ఈ చట్టం నిబంధనల ప్రకారం యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21ఏళ్ల వయసు నిండి తర్వాతే వివాహం చేయాలి. పెళ్లికి ముందు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేయాలి. దీంతో బాల్య వివాహాలను ముందస్తుగానే అధికారులు అడ్డుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామాల్లో 54..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 650
సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే, 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు దాదాపు 13 నెలల్లో 54 వివాహాలు నమోదు అయ్యాయి. సుల్తానాబాద్‌లో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. దీని పరిధిలో సుల్తానాబాద్, జూలపల్లి, ధర్మారం, ఎలిగేడు మండలాలు వస్తాయి. ఈ మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి ఇప్పటివరకు 650 వివాహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎక్కువ సంఖ్యలో వివాహాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఉచితంగా నమోదు చేసే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది.
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే అధికంగా నమోదు
గ్రామపంచాయతీల్లో ఉచితమైనా మొగ్గుచూపని వైనం
ఉచితంగా నమోదు
గ్రామపంచాయతీ కార్యాలయల్లో నిర్ణీత సమయంలో వివాహాలు నమోదు చేసుకుంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. గ్రామీణ దంపతులు ఎక్కడకు వెళ్లాకుండా గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే ఉచితంగా వివాహాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోండి.
– సమ్మిరెడ్డి, ఎంపీవో, సుల్తానాబాద్
వివాహాల నమోదు అంతంతే..
Comments
Please login to add a commentAdd a comment