సమస్యలు పరిష్కరిస్తాం
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి): సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కిందని ఆ యూనియన్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. యూనియఏ ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ యూనియన్లకు చెందిన నాయకులు టీబీజీకేస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి రాజిరెడ్డి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లా డారు. 70కిపైగా కార్మిక హక్కులు సాధించడంతోపాటు కోల్ ఇండియాలో లేనివిధంగా 18 అదనపు హక్కులను సాధించినట్లు పేర్కొన్నారు. నాయకు లు ప్రభాకర్‌రెడ్డి, చంద్రయ్య, సురేందర్, రవితేజ, వెంకటేశ్, శ్రీనివాస్, రమేశ్, తిరుపతి, రామ్‌చరణ్, లేనిన్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం
పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం శుక్రవారం తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాధికారి మాధవితోపాటు విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment