కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరు
● ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని(రామగుండం): తాగునీటి సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో సింగరేణి కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరందిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాగూర్ పేర్కొన్నారు. గురువారం గోదావరినదిలో వాటర్‌పాండ్ పనులను ప్రారంభించి మాట్లాడారు. గోదావరినదిలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయిన క్రమంలో కార్మిక వాడలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకంటున్నామన్నారు. నదిలో ఫిల్టర్‌బెడ్ వద్ద ప్రత్యేక ట్రెంచ్ ద్వారా వాటర్‌పాండ్ ఏర్పాటు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత నీటిని విడుదల చేయిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ట్రెంచ్ ద్వారా ఇన్‌టెక్‌వెల్ వద్దకు నీటిని మళ్లించే పనులు ప్రారంభమయ్యాయి. ఒకసారి పాండ్ నిండితే కార్మిక వాడలకు నెలరోజుల పాటు నీటి సరఫరాకు ఇబ్బంది ఉండబోదని తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సివిల్ అధికారులు వరప్రసాద్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు
గోదావరిఖనిటౌన్(రామగుండం): న్యాయవాది నామ్‌తాబాద్ కిరణ్‌జీ పట్ల దురుసుగా ప్రవర్తించిన వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిని చట్ట పరంగా శిక్షించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకుడు కౌశికహరి న్యాయవాదులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. న్యాయవాదిపై సీఐ దురుసు ప్రవర్తన సరికాదన్నారు. వెంటనే సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సీఐ గతంలోనూ, ఇప్పుడు వివాదాస్పదుడు అవుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదికి బహిరంగ క్షమాపణ చెపాల్పలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. న్యాయవాదులు మురళీధర్‌యాదవ్, రాకం వేణు, ముచ్చకుర్తి కుమార్ పాల్గొన్నారు.
బల్దియాకు రెండు బాబ్‌క్యాట్ వాహనాలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలోని శానిటేషన్ విభాగానికి రూ.76లక్షల వ్యయంతో కొత్తగా రెండు అధునాతన హైడ్రాకిల్ వ్యవస్థ కలిగిన బాబ్‌క్యాట్ అనే భారీ వాహనాలను ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలు గురువారం బల్దియా కార్యాలయానికి చేరుకున్నాయి. వీటిని తవ్వకాలు, కందకాలు తీయడం తదితర పనుల కోసం ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరు
కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరు
Comments
Please login to add a commentAdd a comment