ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ఎలిగేడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారన్న ధీమాను ఎమ్మెల్యే విజయరమణారావు వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన అంతమైందని, దేశంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అలాగే సుల్తానాబాద్, ఎలిగేడు మండలకేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి పరిశీలించారు. గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినపాల ప్రకాష్‌రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment