ఆన్‌లైన్‌లోనే బిల్లుల చెల్లింపు
● ‘మధ్యాహ్న’ కార్మికులకు ప్రయోజనం ● పైలెట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎంపిక ● ఒక్కో జిల్లాలోని ఒక్కో మండలంలో అమలుకు కార్యాచరణ
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వర్కర్లకు సకాలంలో నిధులు అందేలా ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఆదేశించింది. ఆ మండలాల్లో ఈ ప్రక్రియ అమలు చేయాలని విద్యాశాఖ కార్యద ర్శి యోగితారాణా ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీచేయడంతో కలెక్టర్ కో య శ్రీహర్ష, డీఈవో మాధవి అప్రమత్తమయ్యారు.
సకాలంలో బిల్లులు అందించేందుకే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్కారు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలను చేపట్టిన కార్మికులు బిల్లులు సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. అంతేకాదు.. నిధులు వస్తాయో, లేదోనని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇబ్బందుల్లేకుండా అందించవచ్చని వారు వివరించినట్లు తెలిసింది. దీంతో ఆయా జిల్లాల్లో ఒక్కో మండలంలో ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment