● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం(ధర్మపురి): కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే నీళ్లు అందక వరి పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, విప్ లక్ష్మణ్‌కుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే మూడు మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించే లింక్ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నందిమేడారంలోని నందిరిజర్వాయర్‌కు అనుబంధంగా చేపట్టిన లింక్ కాలువ పనులను ఈశ్వర్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ గ్రామాల్లోని ఆయకట్టు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.13 కోట్లు వెచ్చించి నంది రిజర్వాయర్ నుంచి 2.5 కి.మీ. పొడవున లింక్‌కాల్వ నిర్మాణం చేపట్టామని, 90శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మాజీమంత్రి వివరించారు. మిగతా పనులు పూర్తిచేసి సాగునీరందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, రాసూరి శ్రీధర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పుస్కూరి జితేందర్‌రావు, మిట్ట తిరుపతి, చొప్పరి చంద్రయ్య, ఎండీ రఫీ, ఆవుల శ్రీనివాస్, కొత్త మోహన్, పాక వెంకటేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment