మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపులో ఆలస్యమవుతోంది. ఆన్‌లైన్ ద్వారా ఇకనుంచి నేరు చెల్లించేందుకు గల అవకాశాలను పరిశీలించాలి. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మండలాల్లో చెల్లింపులు చేపట్టాలి. వాటి ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తాం.
– యోగితారాణా, విద్యాశాఖ కార్యదర్శి
పొరపాట్లకు తావుండొద్దు
మధ్యాహ్న భోజన వర్కర్లకు సకాలంలో బిల్లులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరం. అయితే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. – పూసాల రమేశ్,
మధ్యాహ్న భోజన వర్కర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment