జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్ వయసు 25ఏళ్లలోపే. కానీ బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను ఇప్పటి వరకూ వివిధ సైబర్ ఫ్రాడ్ కంపెనీలకు దాదాపు 300 మందికి పైగా యువతను విక్రయించాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన నలుగురిని ఇదేవిధంగా లావోస్ తరలించి వేధిస్తే వారు ఎలాగోలా ఇండియాకు వచ్చి రాజశేఖర్‌పై ఫిర్యా దు చేయగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో కేసు నమోదు చేసి లుక్‌అవుట్ నోటీసు జారీచేసింది. గతేడాది సిద్దిపేటలోనూ రాజశేఖర్‌పై ఇదే తరహా కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డిని ఇదే తరహాలో మోసగించిన విషయంలో మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు కరీంనగర్ పోలీసులు రాజశేఖర్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల