● పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామ శివారులోని పురావస్తు శాఖ అధీనంలో ఉన్న సుమారు 66 ఎకరాలు ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ప్రహరీ నిర్మించాలి. కొందరు రియల్టర్లు సమీప భూములు కొనుగోలు చేసి కబ్జాకు యత్నిస్తున్నారు. వారినుంచి భూమిని కాపాడేలా చర్యలు తీసుకోవాలి’అని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మిట్టపల్లి వసంత కలెక్టర్ కోయ శ్రీహర్షకు విన్నవించారు.
● ‘అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు మా భూమి గురైంది.. ఆడపిల్లల కూలి వేతనం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించి ఆదుకోవాలి’ అని ఆ గ్రామానికి చెందిన శంకరమ్మ వేడుకుంది.
పెద్దపల్లిరూరల్: ఇలా.. పలు సమస్యలపై సోమవారం కలెక్టరేట్‌లో
నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణులు ప్రజల నుంచి అర్జీలను అందుకున్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
● ప్రజావాణికి బాధితుల విన్నపం
● ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
● పరిష్కరించాలని ఆదేశాలు