అధికారం దక్కదనేగా ఈ దాష్టీకాలు? | Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అధికారం దక్కదనేగా ఈ దాష్టీకాలు?

Published Sat, Jun 18 2022 6:12 AM | Last Updated on Sat, Jun 18 2022 6:12 AM

Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పారదర్శక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజ లు నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక 40 ఏళ్ల రాజకీయ జీవితమని చెప్పుకునే చంద్రబాబు బూతు పురాణానికి తెగబడ్డారని జల వన రుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇక అధికారం దక్కదనే భయంతోనే దాష్టీకాలకు తెరతీయడం నిజం కాదా అంటూ  సూటిగా ప్రశ్నించారు.

ఆరిపోయే దీపానికి వెలు గెక్కువ అనే రీతిలో పతనావస్థకు చేరిన టీడీపీ.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. అయ్యన్న పాత్రు డు, నెల్లూరులో వడివేలు లాంటి ఓ నేత కంటే దిగ జారిపోయి.. సీఎం వైఎస్‌ జగన్‌ను దూషిస్తున్నార ని మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. సేవా దృక్పథంతో పని చేస్తు న్న వలంటీర్లను అవమానించిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి వేతనం తక్కువ అంటూ రెచ్చ గొట్టి లబ్ధి పొందాలని చూస్తుండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి ఇంకా ఏమన్నారంటే..  

ఆ మూడు సినిమాలు చూస్తే.. 
► బొబ్బిలిపులి, సర్దార్‌ పాపారాయుడు, మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాల్లో మోసగాళ్లను తరిమి కొట్టండి.. గద్దె దించండి అని ఎన్టీఆర్‌ పోరాడారు. ఆ సినిమాలను టీడీపీ కార్యకర్తలు చూ స్తే.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన 420 బాబు ముఖాన ఉమ్మేసి..  బట్టలు ఊడేదాకా చెప్పులతో కొట్టే స్థాయికి వస్తారు. 
► చంద్రబాబుకు ఎలాగైనా అధికారం కట్టబెట్టా లని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు చెడు రాతలు రాస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌పై విషం చిమ్ముతున్నాయి. అయినా ప్రజలు నమ్మరు.

సాగునీటిపై విషపు రాతలా?
► గండికోటలో రూ.1,231 కోట్లు, చిత్రావతిలో రూ.338 కోట్లు, సర్వారాయసాగర్, వామి కొండ సాగర్‌లో రూ.212 కోట్లు వెచ్చించి మిగి లిన పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించిన సీఎం జగన్‌ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ఇది ఈనాడుకు కన్పిం చదా?
► చంద్రబాబు వదిలేసిన డిస్ట్రిబ్యూటరీల పనులు చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా అనుమతి తీసుకుని.. నిర్ణయించిన ధర మేరకు రుసుం చెల్లించి.. భారతి సిమెంట్స్‌ నీటిని వాడుకుంటే తప్పేంటి? 
► వామికొండ, సర్వారాయసాగర్‌ మట్టికట్టల పనుల కోసం మట్టిని తవ్వగా చెరువుగా మారిన భూమిలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని.. నిర్ణయించిన ధరను చెల్లించి చేపల పెంపకానికి రైతులు నీటిని వినియోగించుకోవడం తప్పా? వాటిపై విషపు రాతలు రాస్తారా?
► నారాజీరావును అధికారంలోకి తేవడానికేనా ఈ తప్పుడు రాతలు? రామోజీ ఇప్పటికైనా పెద్దరికం కాపాడుకోవాలి.
► ఒంగోలులో, అనకాపల్లిలో చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడంపై దమ్ముంటే శాసనసభకు రండి.. చర్చిద్దాం. 
► నెల్లూరు బ్యారేజీ, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీలను 2008–09లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పునాది వేసి, ప్రారంభించారు. ఆ రెండు బ్యారేజీలను ఆగస్టులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement