
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు.
కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్‌లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి.
బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమే..
చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్‌లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు.
విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు.
పవన్‌కు రాజకీయాలెందుకు?
అసలు పవన్‌కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్‌లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్‌ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment