
AP Elections Political Latest Updates Telugu..
9: 15PM, Feb 25th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
మైలవరం టీడీపీ టిక్కెట్ పై తేలని పంచాయతీ
- వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ పోటీచేస్తారన్న ప్రచారం నేపధ్యంలో తనకే టిక్కెట్ కావాలంటున్న బొమ్మసాని సుబ్బారావు
- కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు
- మైలవరం టికెట్ పై ప్రజలు ఆందోళనలో ఉన్నారు
- ఇప్పటివరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేశా
- ధర్నాలు ...ర్యాలీలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్నా పార్టీ గుర్తించలేదు
- జి.కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా
- నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు ... హైకమాండ్‌ను గౌరవించి తిరగలేదు
- 1990 నుండి రాజకీయాల్లో ఉన్నా పార్టీ పెద్దలు అర్ధం చేసుకోవాలి
- ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకు ఉపయోగం ఉండదు
- నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఈసారికి టిక్కెట్ ఇవ్వాలి
9:02PM, Feb 25th, 2024
కాకినాడ:
పెద్దాపురం జనసేన పార్టీలో అసమ్మతి సెగ
- టిడిపి నుండి మూడోసారి చినరాజప్పకు సీటు కేటాయింపు
- నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు మనస్తాపం
- కార్యకర్తల సమావేశంలో భావోగ్వేం
- రాజకీయాల కోసం ఆస్ధులు అమ్ముకున్నానన్న బాబు
- పవన్ కళ్యాణ్ వచ్చి తమకు భరోసా ఇవ్వాలని డిమాండ్
8:02PM, Feb 25th, 2024
విజయవాడ :
చంద్రబాబుతో ముగిసిన గంటా భేటీ.
- చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు
- భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పాను
- పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చు.. వారికి పార్టీ న్యాయం చేస్తుంది.
- పొత్తులు.. సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ - జనసేన పార్టీల అంతర్గత వ్యవహరం
7:20PM, Feb 25th, 2024
టీడీపీ, జనసేన పొత్తుపై మండిపడుతున్న కాపు నేతలు
- జనసేనకు 24 సీట్లే ఇవ్వడం బాధాకరం
- జనసేనను భూస్థాపితం చేయాలనే చంద్రబాబు కుట్ర
- 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారు
- తప్పుడు సమాచారంతో చిరంజీవిని ఎదగకుండా చేశారు
- రంగా సీఎం అయిపోతాడనే భయంతో హత్య చేయించారు
- నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు తేనెపూసిన కత్తి లాంటివాడంటూ మండిపడుతున్న కాపు నేతలు
7:00PM, Feb 25th, 2024
విజయవాడ:
చంద్రబాబుతో ముగిసిన దేవినేని ఉమా భేటీ
- బాబుతో భేటీ అనంతరం దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు
- చంద్రబాబు మాటే శిరోధార్యం అని కామెంట్ చేసిన దేవినేని ఉమా
- తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినంటూ ఉమా కామెంట్
- తనకు టిక్కెట్ ఉందా లేదా అనే విషయం పై నోరుమెదపని దేవినేని ఉమా
6:00PM, Feb 25th, 2024
విజయనగరం జిల్లా
సీఎం వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలన మరలా తీసుకురావాలి: రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
- పొత్తులతో మళ్లీ ఎన్నికలకు వస్తున్న చంద్రబాబు గతంలో 600 హామీలు అని చెప్పి మోసం చేశారు
- ఇప్పుడు ఆరు హామీలు అని మభ్యపెట్టడానికి మళ్లీ వచ్చారు.
- ఎన్ని పొత్తులతో వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెప్పి పంపాలి.
5:40 PM, Feb 25th, 2024
బాబు దెబ్బ పవన్ అబ్బా
- గోరంట్ల బుచ్చయ్య చౌదరికే రాజమండ్రి రురల్?
- కందుల దుర్గేష్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయమన్న పవన్
5:20 PM, Feb 25th, 2024
పశ్చిమగోదావరి జిల్లా:
టీడీపీ కోసం కష్టపడితే అవమానించారు : మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
- బాబు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారు
- ఉండి సీటు నాకు రాకపోవడానికి కారణం అధిష్టానమే చెప్పాలి
- నా బలం ఏంటో ప్రజాక్షేత్రంలో చూపిస్తా
- సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదు
- ఎన్నికల్లో బరిలోకి దిగుతా
5:10 PM, Feb 25th, 2024
పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు
- కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం
- పదేళ్లుగా కష్టపడితే, ఆశలు అడియాశలు చేశారన్న జనసేన కేడర్
- తమకి చెప్పకుండా పెడన టికెట్ టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీత
- జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు
- అతడి వల్లే పెడన టికెట్ జనసేనకు రాకుండా పోయిందని ఆగ్రహం
- పెడన టికెట్ పై పవన్ పునరాలోచించాలన్న జనసేన కార్యకర్తలు
- నిర్ణయం మారకపోతే 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్న జనసేన నేతలు
5:00 PM, Feb 25th, 2024
అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి సెగలు
- అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో భగ్గుమన్న టీడీపీ నేతలు
- నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన
- పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు ఇవ్వకపోవడంపై నిరసన
- గెలిచే సీటును టీడీపీకి కేటాయించలేదంటూ ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహం
- పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువచ్చిన కార్యకర్తలు
- హై కమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక
4:45 PM, Feb 25th, 2024
డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట టిక్కెట్టు టిడిపికి కేటాయించడంపై భగ్గుమన్న జనసేన శ్రేణులు
- పార్టీ కార్యాలయం వద్ద జెండాలు పీకేసిన జనసేన కార్యకర్తలు
- జనసేన జెండాలు ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేసిన జనసేన నాయకులు
- తమపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన పార్టీ కోసం కట్టుబడి ఉన్నామన్న నాయకులు
- చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తుంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపాటు...
- పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్యాకేజీ ఇస్తారని తమను హేళన చేస్తున్నారు
- అవమానాన్ని భరించలేక జనసేన జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేస్తున్నాం
- కొత్తపేట టిక్కెట్టు విషయమై టిడిపి జనసేన అధినేతలు నిర్ణయం మార్చుకోవాలని కోరిన జనసేన కార్యకర్తలు
- కొత్తపేట టిక్కెట్టు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్‌కు కేటాయించాలని డిమాండ్
4:40 PM, Feb 25th, 2024
పవన్ 24 సీట్లే తీసుకోవడం ఆయన సామర్థ్యం తెలుస్తుంది: మంత్రి బొత్స
- మా పార్టీ ప్రకటించిన జాబితాపై గందరగోళం లేదు
- ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు
4:30 PM, Feb 25th, 2024
విజయవాడ
చంద్రబాబు మైనార్టీలను ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నాడు: వైస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా
- మైనార్టీలకు టీడీపీ తరుపున ఒక్క టికెట్ ఇవ్వటం దారుణం
- రాష్ట్రంలో మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపేట
- అజిత్ నగర్ ఖబరస్థాన్ పై బోండా ఉమ, ఎల్లో మీడియా నీచ రాజకీయాలు చేయడం దారుణం.
4:20 PM, Feb 25th, 2024
చంద్రబాబు బలంగా ఉంటే 24 సీట్లు పవన్ కళ్యాణ్‌కి పంచేవాడా?
రమేష్ బాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే
- టిడిపి పార్టీ బలంగా లేదు కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని కలుపుకున్నాడు
- మళ్ళీ భయంతోనే చంద్రబాబు బీజేపీ దగ్గరకు వెళ్ళాడు
- జగన్‌ను తిట్టించేందుకు ఆయన చెల్లెల్ని చంద్రబాబు తీసుకొచ్చారు
- ఎన్ని చేసినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారు
- మళ్ళీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు
- నిన్న మొన్నటి వరకు చంద్రబాబు పాలన అద్భుతమని బుద్ధప్రసాద్ అన్నారు
- బుద్ధప్రసాద్‌కి సీటు రాకపోతే చంద్రబాబు పాలన అద్భుతం కాదని బుద్ధప్రసాద్ అంటున్నారు
3:33 PM, Feb 25th, 2024
పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు: అడపా శేషు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్
- చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టిన చరిత్ర నీదే
- నిన్ను చిన్నచూపు చూస్తే కాపులను చూసినట్లు కాదా
- పవన్ ఇలా చేస్తాడని కాపులు, జనశేన నాయకులు కలలో కూడా ఊహించి ఉండరు
- రాజకీయ కుటుంబాలకు తెలుస్తుంది రాజకీయ విలువ
- సినీనటుడుకి ఏం తెలుస్తుంది రాజకీయాలు
- రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపులను పవన్ దారుణంగా మోసం చేశాడు
- చంద్రబాబు వేసిన ముస్టితో మురిసిపోతున్నాడు
- చంద్రబాబును ఎప్పటికీ కాపు ద్రోహిగానే చూస్తాం
- అలాంటి చంద్రబాబుతో చేతులు కలిపి కాపులను మోసం చేశావ్
- రంగా కాపుల ఔన్నత్యాన్ని నిలబెడితే పవన్ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు
- హరిరామ జోగయ్య ఎంతో మనోవేదనకు గురై ఈ లేఖ రాశాడు
- రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు
- తనపై ఉన్న ముద్రను పోగొట్టుకోవడానికి పవన్‌ను చంద్రబాబు వాడుకున్నాడు
- జనసేన పార్టీని చంద్రబాబే పెట్టించాడన్న అనుమానం మాకు కలుగుతోంది
- పవన్‌ను అడ్డుపెట్టుకుని ముద్రగడ, వంగవీటి రంగా కుటుంబాలకు రాజకీయంగా అవకాశం లేకుండా చేశారు
3:20 PM, Feb 25th, 2024
కర్నూలులో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
- బీసీ జయహో సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్‌చల్
- ఎమ్మిగనూరు టికెట్ కోసం వాగ్వాదనికి దిగిన మాచాని సోమనాథ్ వర్గీయులు
- బీసీ జయహో సభలో బీసీని అవమానించారని మాచాని అనుచరులు అసహనం
2:27 PM, Feb 25th, 2024
విజయవాడ:
టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనపై దేవినేని అవినాష్ సెటైర్లు
- టీడీపీ , జనసేన పొత్తు నారా లోకేష్ అభివృద్ధి కోసమే
- ఎందుకూ పనికిరాని ...టీడీపీ కార్యకర్తలే వద్దనుకుంటున్న లోకేష్ కోసమే చంద్రబాబు ప్రయత్నం
- నారాలోకేష్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడమే చంద్రబాబు లక్ష్యం
- చంద్రబాబు చెప్పే సన్రైజ్ స్టేట్ అంటే ఏపీ అభివృద్ది కాదు
- ఆయన సన్ లోకేష్ రైజ్ కోసమేనని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి
- తూర్పు నియోజకవర్గానికి ఏం చేశాడని మూడవ సారి గద్దె రామ్మోహన్ కు చంద్రబాబు సీటిచ్చాడు
- చంద్రబాబు జనసేనను నమ్మించి మోసం చేశాడు
- పవన్ కళ్యాణ్ ను , జనసేన పార్టీ లేకుండా చేయాలనేదే టీడీపీ , నారా లోకేష్ లక్ష్యం
- 24 సీట్లకే పరిమితం చేయడం పై జనసేన నాయకులు ఆలోచించాలి
- జనసేన నాయకులు...కార్యకర్తలారా ఆలోచించండి
- మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు వెంట ఉంటారా
- అన్ని వర్గాలకు మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారా
- చంద్రబాబు ఎవరికి ఎక్కువ టిక్కెట్లిచ్చాడో అంతా గమనిస్తున్నారు
2:05 PM, Feb 25th, 2024
పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్
- టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడమేంటి?
- జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?
- జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా?.
- పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు.
- ఒకరు ఒవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు.
- ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు.
- జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు.
- పవన్ పరిపాలన అధికారం చేపట్టడం.
- పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు.
- జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటి.
- జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా?
- పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి.
- చెరిసగం మంత్రి పదవులు దక్కాలి.
- ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి.
- సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన జరిగినయా?
- 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కావులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు
- జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగలేదు.
1:45 PM, Feb 25th, 2024
యాదవుల చిరకాల కోరిక నెరవెరింది: అనిల్ కుమార్ యాదవ్
- యాదవులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు.
- కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు.
- రాజ్యసభ, లోక్‌సభ సీట్లు యాదవులకు ఇచ్చారు.
- నన్ను మంత్రిగా సీఎం జగన్ చేశారు.
- సీఎం జగన్ నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు.
- నరసరావుపేట, ఏలూరు లోక్‌సభ స్థానాలు యాదవులకు కేటాయించారు.
- బీసీలకు సముచితమైన గౌరవం ఇచ్చారు.
- మనకు గౌరవం ఇచ్చిన సీఎం జగన్‌కు యాదవులు అందరూ అండగా ఉండాలి.
1:20 PM, Feb 25th, 2024
టీడీపీ, జనసేనపై బొత సెటైర్లు..
- టీడీపీతో పొత్తులో జనసేన పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు.
- అమిత్ షాను కలిసినా, అమితాబచ్చన్‌ని కలిసినా వైఎస్సార్‌సీపీ సింగిల్‌గా మాత్రమే పోటీ చేస్తుంది.
- మా పార్టీ ప్రకటించిన లిస్టులపై గందరగోళం లేదు.
- ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.
1:00 PM, Feb 25th, 2024
నా దీక్షతోనైనా పవన్ కళ్లు తెరవాలి: సూర్యచంద్ర
- డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు.
- ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ జనం సమస్యల కోసం పోరాడాను.
- పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు.
- ఇప్పుడు పొత్తు ధర్మంలో టికెట్ రాలేదని చెప్తున్నారు.
- డబ్బులేని వారెవరు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నాను.
- నా మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలి
- సూర్యచంద్ర సతీమణి శ్రీదేవి కామెంట్స్..
- పొత్తు ధర్మం పేరు చెప్పి జనసేన పార్టీ మమ్మల్ని మోసం చేసింది.
- డబ్బు లేదని తెలిసి జనాల్లో తిరుగుతూ కష్టపడే నాయకున్ని ఎందుకు విస్మరించారు.
- మాపై ఆధారపడిన జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి?.
- జనసేన కార్యకర్తలు ఎవరూ కుటుంబాల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి పార్టీ కోసం త్యాగాలు చేయకండి.
- నా భర్తకు అన్యాయం జరిగింది.
- ఐదేళ్లుగా ఇద్దరం జనం సమస్యలపై పోరాడుతున్నా పవన్ మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం.
- జనసేన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు.
- మా ప్రాణ త్యాగం అందరికీ గుణపాఠం కావాలి
12:40 PM, Feb 25th, 2024
పెనుకొండ టీడీపీపై అధిష్టానం ఫోకస్
- మాజీ ఎమ్మెల్యే పార్ధసారథికి చంద్రబాబు నుంచి పిలుపు
- పెనుకొండ టీడీపీ అభ్యర్ధిగా సవితమ్మ పేరు ప్రకటన
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్థసారథి వర్గీయులు
12:20 PM, Feb 25th, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్ర పోటీ
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెండింగ్ స్ధానాలపై నేతల మధ్య తీవ్ర పోటీ
- మైలవరం, పెనమలూరు టికెట్ రేసులో నలుగురు ఆశావహులు
- మైలవరం రేసులో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, వసంత కృష్ణ ప్రసాద్
- పెనమలూరు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్
- వసంత కృష్ణ ప్రసాద్ చేరే అవకాశం ఉండటంతో పెండింగ్‌లో రెండు స్ధానాలు
12:00 PM, Feb 25th, 2024
అవనిగడ్డ సీటుపై క్లారిటీతో ఉన్న జనసేన
- జనసేన అభ్యర్థిగా విక్కుర్తి వెంకట శ్రీనివాస్ పోటీ చేయనున్నట్టు స్థానిక నేతలకు సంకేతాలు
- విక్కుర్తి శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు
- రెండు రోజుల్లో అభ్యర్థిగా ప్రకటన చేస్తారని లోకల్ టాక్
- ఇవాళ అవనిగడ్డ వెళ్లి స్థానిక నేతలను కలవనున్న శ్రీనివాస్
11:40 AM, Feb 25th, 2024
టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు
- తీవ్ర అసంతృప్తిలో టికెట్ రాని నేతలు
- అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు
- చంద్రబాబుని కలిసిన ఆలపాటి రాజా
- తెనాలి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆలపాటి రాజా
- తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు కేటాయింపు
- తీవ్ర అసంతృప్తికి గురైన ఆలపాటి రాజా
- రేపు పార్ధసారథితో మాట్లాడనున్న చంద్రబాబు
11:15 AM, Feb 25th, 2024
పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్..
- పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్తున్నాం
- మా ప్రయత్నం, మా స్ట్రాటజీ మాకున్నాయి
- టీడీపీ, జనసేన పూర్తి స్థానాలు ప్రకటించలేదు.. కొన్నే ప్రకటించారు
- మా నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఉంటుంది
- పొత్తులు.. ఎన్ని సీట్టు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది
- అప్పటి వరకూ మేం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పనిచేస్తాం
- పొత్తులు.. సీట్ల పంపకంపై మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది
11:00 AM, Feb 25th, 2024
పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్
- తన సీటేటో? తానే డిసైడ్ చేసుకోలేనోడు..
- ఇక, జనాలకు ఏం చేస్తాడు.. జన సైనికులకు ఏం చేస్తాడు?
తన సీటేదో ?
— Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2024
తానే డిసైడ్ చేసుకోలేనోడు
"జనానికి" ఏమి చేస్తాడు
"జనసైనికులకి" ఏం చేస్తాడు !@PawanKalyan @JanaSenaParty
10:45 AM, Feb 25th, 2024
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్
- ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే ప్రతిపక్షాలు ఒంటరిగానే పోటీ చేసేవి.
- ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్
- పొత్తలతో ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించాలని చూస్తున్నారు
- కానీ, ప్రజలు ప్రతిపక్షాలకు బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
- వైఎస్సార్‌సీపీ వల్లే నాలాంటి పేదలు ఎమ్మెల్యేలు అయ్యారు.
- చంద్రబాబు పదవీ వ్యామోహంతో అందరి కాళ్ల పట్టుకొంటున్నారు.
- కులాలను, మాతాలను విడగొట్టి ఓట్ల రాజకీయాలు చెయ్యడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం
10:15 AM, Feb 25th, 2024
త్వరలో విశాఖ నుంచే పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి
- రాష్ట్రంలో పలు బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది.
- విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం.
- రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు.
- విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది.
- ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది.
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది.
- పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ.
- విశాఖ బీచ్‌లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
- పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము.
9:00 AM, Feb 25th, 2024
ప్యాకేజీ స్టార్ సీటుపై క్లారిటీ ఇవ్వని దత్త తండ్రి
- కాపులను హింసించిన చంద్రబాబును ఎలా నమ్ముతారు?
- 24 సీట్లు తీసుకున్న పవన్ సీఎం ఎలా అవుతాడు?
- 24 సీట్లతో పవన్ యుద్ధం ఎలా చేస్తాడు.
కాపులను హింసించిన @ncbnను ఎలా నమ్ముతారు?
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
24 సీట్లు తీసుకున్న @PawanKalyan ఎలా సీఎం అవుతాడు?
-మంత్రి గుడివాడ అమర్నాథ్#TDPJSPCollapse pic.twitter.com/J5IoI6ivLa
8:15 AM, Feb 25th, 2024
చంద్రబాబు పొలిటికల్ స్టంట్‌లో పావుగా పవన్..
- ఎంతో మందిని మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు
- నేడు పవన్‌కు అదే తరహా మోసం.
- జనసేనకు గుప్పెడు సీట్లు విదిలించిన బాబు.
- జనసేన స్థానాలను కూడా చెప్పుకుండా కథ నడిపిన చంద్రబాబు.
ఇన్నేళ్ళుగా ఎంతోమందిని మోసగిస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు నేడు పవన్ కళ్యాణ్ ను మోసం చేసారు. ఆయనకు గుప్పెడు సీట్లు విదిలించి , అది కూడా అభ్యర్థులను, జనసేన పోటీ చేసే స్థానాలను కూడా చెప్పకుండా కథ నడిపించారు. #TDPJSPCollapse #PackageStarPK#EndOfTDP pic.twitter.com/ZOrhTfL01K
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
7:30 AM, Feb 25th, 2024
అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
- గోకవరం మండలం అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
- జనసేన టికెట్ ప్రకటించకపోవడంతో అచ్యుతాపురం ఆలయం వద్దకు సతీసమేతంగా పాదయాత్ర చేస్తూ వెళ్లిన పాఠంశెట్టి సూర్యచంద్ర
- తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన పాఠంశెట్టి దంపతులు
- నిరుపేదలు, డబ్బులేని వారు కష్టపడి పనిచేసినా అసెంబ్లీకి వెళ్లలేరా అని తీవ్ర ఆవేదన
- అమ్మవారి ఆలయం వద్దే రాత్రంతా గడిపిన పాఠంశెట్టి దంపతులు
- పాఠంశెట్టి దీక్షకు మద్దతుగా ఆలయం వద్దకు చేరుకున్న అభిమానులు
- ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు చేపట్టిన పోలీసులు
7:10 AM, Feb 25th, 2024
సమన్వయం లేనిచోటే సమన్వయ సభ
- 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన బహిరంగ సభ
- ఒకేరోజు వేర్వేరుగా ఏర్పాట్లు పరిశీలించిన ఇరు పార్టీలు
- తొలి జాబితాలో ఖరారు కాని గూడెం టికెట్
7:00 AM, Feb 25th, 2024
బాబుకే భ'జనసేన'!
- దాని ఫలితమే టీడీపీ పొత్తులో కేవలం అరకొర సీట్లకు పరిమితం
- ఆ పార్టీ కష్టాల్లో ఉంటే జనసేనే పైకి లాగిందన్న పవన్
- కానీ, అదే టీడీపీ ఇంతకన్నా బలంగా ఉన్నప్పుడే 2009లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించింది
- అప్పుడు తెలంగాణలో 119 సీట్లు ఉండగా, అందులో 45 సీట్లు టీఆర్‌ఎస్‌కే
- ఆ మహాకూటమిలో ఉమ్మడి ఏపీలో ఉభయ కమ్యూనిస్టులకు 32 సీట్లు కూడా ఇచ్చింది
- 2014లో బీజేపీకి కూడా చాలా ప్రాధాన్యత సంఖ్యలో సీట్లు కేటాయించింది
- కానీ, జనసేనకు ఇప్పుడు ఇంతేనా అంటూ అభిమానుల మండిపాటు
- పార్టీ ఆవిర్భావం నుంచీ తమ అధినేత బాబు సేవలోనేనని ఆగ్రహావేశాలు
6:50 AM, Feb 25th, 2024
వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం
- చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు
- వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు
- వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు
- రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు
- బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు
- ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు
- కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు
- రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు
- చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి
6:40 AM, Feb 25th, 2024
పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని
- ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు
- చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు
- 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా?
- పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది
- పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో
- పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు
- పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో
- పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు
- జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట
- చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు
- కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు
- చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు
- బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే
- భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు
- కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు
- ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది
6:30 AM, Feb 25th, 2024
24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్: సజ్జల
- పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది
- అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు
- చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు
- ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు
- పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు
- జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు
- టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు
- తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు
- జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు
- పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి
- 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు
- పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది
- 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా?
- 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు
- రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు
- ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు
- వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment