టీడీపీ-జనసేన ఫస్ట్‌ లిస్ట్‌.. పావలా వంతు కూడా ఇవ్వలేదు! | AP Election 2024: TDP And Janasena Announced First List | Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేన ఫస్ట్‌ లిస్ట్‌: పంతం నెగ్గించుకున్న బాబు, పావలా వంతు కూడా ఇవ్వలేదు!

Published Sat, Feb 24 2024 11:47 AM | Last Updated on Sat, Feb 24 2024 1:29 PM

AP Election 2024 TDP And Jansena Announced First List - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే.. 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు . శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఈ ప్రకటన చేశారు. 

పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు.  అలాగే టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరఫున 24 సెగ్మెంట్లకుగానూ కేవలం ఐదు స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్‌. 

ఇక ప్రకటన సమయంలో బీజేపీ ప్రస్తావన రాగా.. ఇరువురూ తలో మాట చెప్పడం గమనార్హం. మా పొత్తుకు బీజేపీ శుభాసీస్సులు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొనగా..  ‘‘ప్రస్తుతానికి టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యింది. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు బీజేపీ కలిసి వస్తే.. అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాం’’ అని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.

పావలా వంతు కూడా..
సీట్‌ షేరింగ్‌ విషయంలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. పొత్తులో భాగంగా.. జనసేనకు పావలా వంతు సీట్లు కూడా ఇవ్వలేదు చంద్రబాబు. ఇక జనసేన లేకుంటే టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్‌ సైతం ఇప్పుడు మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవడం గమనార్హం. అలాగే.. తణుకు స్థానానికి గతంలో అభ్యర్థిని ప్రకటించిన పవన్‌ ఇప్పుడు ఆ స్థానానికి టీడీపీకే వదిలేయడం గమనార్హం.


నోట్‌ప్యాడ్‌పై రాసిన జనసేన అభ్యర్థుల జాబితా చూపిస్తున్న పవన్‌

సీనియర్లకు హ్యాండిచ్చిన చంద్రబాబు..
తొలి జాబితా సందర్భంగా చంద్రబాబు.. టీడీపీ సీనియర్లకు షాకిచ్చాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావుకి హ్యాండిచ్చాడు. అటు గంటా శ్రీనివాసరావుకు కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. 


👉చంద్రబాబు ప్రకటించిన టీడీపీ అభ్యర్థులు వీరే

టీడీపీ అభ్యర్థులు వీరే..

  • ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
  •     టెక్కలి-అచ్చెన్నాయుడు
  •     ఆమదాలవలస-కూన రవికుమార్‌ 
  •     రాజాం-కోండ్రు మురళి
  •     కురుపాం - తొయ్యక జగదీశ్వరి
  •     పార్వతీపురం - విజయ్‌ బోనెల
  •     సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
  •     బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
  •     గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్‌
  •     విజయనగరం - అదితి గజపతిరాజు

  •     విశాఖ ఈస్ట్‌ - వెలగపూడి రామకృష్ణబాబు
  •     విశాఖ వెస్ట్‌ - పీజీవీఆర్‌ నాయుడు
  •     అరకు - సియ్యారి దొన్ను దొర
  •     పాయకరావుపేట - వంగలపూడి అనిత
  •     నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
  •     తుని-యనమల దివ్య
  •     పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
  •     అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
  •     ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
  •     పి.గన్నవరం - రాజేశ్‌ కుమార్‌
  •     కొత్తపేట - బండారు సత్యానంద రావు
  •     మండపేట - జోగేశ్వరరావు

  •     రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
  •     జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
  •     ఆచంట - పితాని సత్యనారాయణ
  •     పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
  •     ఉండి - మంతెన రామరాజు
  •     తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
  •     ఏలూరు - బాదెటి రాధాకృష్ణ
  •     చింతలపూడి - సోంగ రోషన్‌
  •     తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్‌
  •     నూజివీడు - కొలుసు పార్థసారథి
  •     గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
  •     గుడివాడ - వెనిగండ్ల రాము

  •     పెడన - కాగిత కృష్ణ ప్రసాద్‌
  •     మచిలీపట్నం - కొల్లు రవీంద్ర 
  •     పామర్రు - వర్ల కుమార రాజ
  •     విజయవాడ సెంట్రల్‌ - బొండ ఉమ
  •     విజయవాడ ఈస్ట్‌ - గద్దె రామ్మోహన రావు
  •     నందిగామ - తంగిరాల సౌమ్య
  •     జగ్గయ్యపేట - శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
  •     తాడికొండ - తెనాలి శ్రవణ్‌ కుమార్‌
  •     మంగళగిరి - నారా లోకేశ్‌
  •     పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర 

  •     వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు
  •     రేపల్లె - అనగాని సత్యప్రసాద్‌
  •     బాపట్ల - వి.నరేంద్ర వర్మ
  •     ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు
  •     చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
  •     సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ
  •     వినుకొండ - జీవీ ఆంజనేయులు
  •     మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
  •     యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్‌ బాబు
  •     పర్చూరు - ఏలూరి సాంబశివరావు
  •     అద్దంకి - గొట్టిపాటి రవికుమార్‌

  •     సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  •     ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
  •     కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి
  •     కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  •     కావలి - కావ్య కృష్ణారెడ్డి
  •     నెల్లూరు సిటీ - పి. నారాయణ
  •     నెల్లూరు రూరల్‌ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  •     గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్‌
  •     సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ
  •     ఉదయగిరి - కాకర్ల సురేశ్‌

  •     కడప - మాధవిరెడ్డి
  •     రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
  •     పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
  •     మైదుకూరు - పుట్టా సుధాకర్‌ యాదవ్‌
  •     ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ 
  •     శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  •     కర్నూలు - టీజీ భరత్‌
  •     పాణ్యం - గౌరు చరితా రెడ్డి
  •     నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్‌
  •     బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి

  •     డోన్‌ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
  •     పత్తికొండ - కేఈ శ్యాంబాబు
  •     కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
  •     రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
  •     ఉరవకొండ - కేశవ్‌
  •     తాడిపత్రి - జేసీ అస్మిత్‌ రెడ్డి
  •     శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ
  •     కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు
  •     రాప్తాడు - పరిటాల సునీత
  •     మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్‌

  •     హిందూపురం - నందమూరి బాలకృష్ణ
  •     పెనుకొండ - సవిత
  •     తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
  •     పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
  •     నగరి - గాలి భానుప్రకాశ్‌
  •     గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్‌ వీఎం. థామస్‌
  •     చిత్తూరు - గురజాల జగన్మోహన్‌
  •     పలమనేరు - ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
  •     కుప్పం - నారా చంద్రబాబు నాయుడు

ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే

  • కాకినాడ రూరల్‌.. నానాజీ,
  • నెల్లిమర్ల.. లోకం మాధవి
  • తెనాలి.. నాదెండ్ల మనోహర్‌
  • అనకాపల్లి.. కొణతాల రామకృష్ణ.
  • రాజానగరం.. రామకృష్ణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement