Dec 20th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines Dec 20th In Telugu | Sakshi
Sakshi News home page

AP Elections Political News Dec 20th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, Dec 20 2023 7:14 AM | Last Updated on Wed, Dec 20 2023 9:38 PM

AP Elections Political News Updates Headlines Dec 20th In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

6.35 pm, బుధవారం, Dec 20, 2023
పసలేని విమర్శలతో సరిపెట్టిన తెలుగుదేశం నాయకులు

  • యువగళంలో నాయకుల పసలేని విమర్శలు, పనికిరాని కబుర్లు
  • ప్రభుత్వాన్ని విమర్శించే టాపిక్‌ దొరక్క.. అరుపులు, కేకలతో సరిపెట్టిన టిడిపి నేతలు
  • విద్య, వైద్యం, సాగునీరు, రైతాంగం.. ఇలా ఏ ఒక్క టాపిక్‌పై సాధికారికంగా మాట్లాడలేకపోయిన నేతలు
  • ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు టాపిక్‌ లేక.. సైకో అంటూ నిందలు
  • ఈ రంగంలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోయిన నేతలు
  • ఎంత సేపు గర్జనలు, కేకలు, బూతులు, సినీ డైలాగులు
  • మామ బాలకృష్ణ, అల్లుడు లోకేష్‌, అందరిదీ అదే దారి
  • మా పార్టీ ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తుంది.. ఇవీ మా పథకాలు అని చెప్పుకోలేకపోయిన నేతలు
  • ప్రస్తుతం అమలవుతోన్న సంక్షేమ పథకాల విషయంలోనూ అదే దారి
  • సంక్షేమ పథకాలను తప్పుపట్టలేకపోయారు, అలాగని మరిన్ని మెరుగైనవి ఇస్తామనలేకపోయారు

6.15 pm, బుధవారం, Dec 20, 2023
లోకేష్‌ వారసుడా? నాయకుడా? ఆసక్తికరమైన చర్చను లేవనెత్తిన అచ్చెన్నాయుడు

  • చాలా మంది లోకేష్‌ వారసుడని అన్నారు.. కానీ నేను కాదన్నాను
  • లోకేష్ వారసుడు కాదు.. రాజకీయ నాయకుడు

లోకేష్‌ వారసుడు కాకపోతే ఈ సమాధానాలు చెప్పగలవా అచ్చెన్న.? : YSRCP

  • ఏ ఎన్నిక గెలవని లోకేష్‌ హఠాత్తుగా బాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి ఎలా అయ్యాడు?
  • ఏ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేయని లోకేష్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఎలా అయ్యాడు?
  • ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ గెలవని లోకేష్‌.. మీ పార్టీ సీఎం అభ్యర్థి ఎలా అయ్యాడు?
  • ప్రాక్టీస్‌ కోసం పాదయాత్ర చేయించి నాయకుడిగా బిల్డప్‌ ఇప్పిస్తారా?


(ఫైల్‌ ఫోటో : పాదయాత్రలో భాగంగా పప్పులు, ఉప్పుల ప్యాకెట్లతో లోకేష్‌కు స్వాగతం)

5.45 pm, బుధవారం, Dec 20, 2023
కుప్పం ఎవరి సీటు?

  • మామ ఎన్టీఆర్‌ను అడ్డు పెట్టుకుని కుప్పం సీటుపై కన్నేశాడు చంద్రబాబు
  • ఆ కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఏం చేశాడంటే..?
  • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. సీఎం సీటు, పార్టీ లాక్కున్నాడు చంద్రబాబు
  • కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా.. చివరిలో ఉంటుంది.
  • తమిళనాడు - కర్ణాటక సరిహద్దుల్లో.. కుప్పం నియోజకవర్గం ఉంటుంది.
  • కుప్పంలో అత్యధికంగా... వన్నియార్ క్షత్రియ, గాండ్ల.. తదితర వెనుకబడిన బీసీ కులాలు

కుప్పం నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?

  • డి.రామబ్రహ్మం,
  • ఏపీవీ చెట్టి,
  • డి. వెంకటేశం అనే..
  • మొదటి మూడు సార్లు గెలిచిన అందరూ బీసీ వర్గాల నేతలే
  • 1978లో తొలిసారి కమ్మ సామాజిక వర్గం నుంచి దొరస్వామి నాయుడు ఎన్నిక
  • 1983లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కమ్మ వర్గానికే చెందిన ..రంగ స్వామి నాయుడు.. ఈయన రెండు సార్లు గెలిచారు.
  • కుప్పంలో ఎక్కువ మంది.. ఎన్టీఆర్‌ అభిమానులు ఉండటం టిడిపికి కలిసివచ్చింది
  • 1989లో చంద్రబాబు కన్ను కుప్పం సీటుపై పడింది

చంద్రబాబు చరిత్ర ఏంటీ?

  • చంద్రగిరిలో కాంగ్రెస్ నుంచి గెలిచాడు.
  • 1983లో టీడీపీ చేతిలో పరాజయం తరువాత.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. మామ పంచన చేరాడు.
  • 1985లో చంద్రబాబు పోటీ చేయలేదు.
  • కానీ.. ఆ సమయంలో తనకు సురక్షిత నియోజకవర్గమైన కుప్పం ఎంచుకున్నాడు..
  • ఎన్టీఆర్‌కు అల్లుడు కావడంతో.. కుప్పం సీటు సులువుగానే దొరికింది.
  • 1989లో రంగస్వామి నాయుడ్ని తప్పించి.. చంద్రబాబు కుప్పం బరిలో నిలిచి గెలిచాడు.
  • అప్పటి నుంచి ఏడుసార్లు.. గెలుస్తూనే వస్తున్నాడు.

అంటే.. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు.. బీసీల నియోజకవర్గంలో బాబు దూరాడు.

  • పైగా.. పులివెందుల నియోజకవర్గాన్ని YSRCP బీసీలకు ఇస్తుందా అంటూ.. ప్రసంగాలు చేస్తాడు.
  • పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం... 1978 నుంచి గెలుస్తూ వస్తుంది.
  • అంతేకాదు.. పులివెందుల వైఎస్ఆర్‌ కుటుంబం సొంతూరు.

ఎన్నికల సమయంలో బీసీ జపం చేయడం.. తరువాత మరిచిపోవడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.

3.22 pm, బుధవారం, Dec 20, 2023
కృష్ణా సీట్లన్ని గెలిచి సీఎంకు బహుమతి ఇస్తాం: వెల్లంపల్లి

  • తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
  • నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి నేను, మేయర్ కలిసి క్యాంప్ ఆఫీసుకు వెళ్లాం
  • విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారు అనేది ప్రచారం మాత్రమే
  • నేను పార్టీకి రాజీనామా చేశానని ఎల్లో మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు
  • సీఎం జగన్ ఏం చెప్పినా... చేయడానికి సిద్ధంగా ఉన్నాను
  • విజయవాడలోని మూడు నియోజకవర్గాలను గెలిపిస్తాం
  • ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపించి సీఎంకి బహుమతి ఇస్తాము

3.02 pm, బుధవారం, Dec 20, 2023
యువగళం ఔట్‌సైడర్స్‌ యాత్ర : YSRCP

  • యువగళం యాత్ర పక్క రాష్ట్రం వాళ్లు చేస్తోన్న యాత్ర
  • నిజంగా నిబద్ధత ఉంటే ఏపీలో ఎందుకు ఉండరు?
  • పార్ట్‌టైం పాలిటిక్స్‌ చేస్తూ ఏపీని దెబ్బతీయడానికి వచ్చారు.!

2.50 pm, బుధవారం, Dec 20, 2023
అట్టర్‌ ఫ్లాప్‌ పాదయాత్రకు హడావిడి చేస్తున్నారా? : YSRCP

  • యువగళం యాత్ర అట్టర్‌ఫ్లాప్‌ అయింది
  • ప్రజల కోసం కాకుండా రాజకీయ స్వార్థం కోసమే జరిగింది
  • మాయమాటలు చెప్పి దోచుకుందామని మళ్లీ వస్తున్నారు

2.40 pm, బుధవారం, Dec 20, 2023
ఎంతలో ఎంత మార్పు.. అది కదా చంద్రబాబు అంటే..! : YSRCP

  • విశాఖ చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ
  • అక్టోబర్‌ నెలలో కోర్టులో బోలెడు రోగాల జాబితా చెప్పిన చంద్రబాబు
  • డాక్టర్‌ లేకుంటే.. కాలు కదపలేనన్నట్టు బిల్డప్‌
  • బయటకు రాగానే రోగాలన్నీ మటు మాయం

2.24 pm, బుధవారం, Dec 20, 2023
రాష్ట్రాన్ని టిడిపి అప్పుల పాలు చేసింది: సాయిరెడ్డి

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పు 169% పెరిగింది : ఎంపీ విజయసాయి రెడ్డి
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయి
  • టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసింది
  • పేద ప్రజల కలలను నెరవేర్చేందుకు సీఎం జగన్ పెట్టుబడి పెడుతున్నారు
  • టీడీపీకి, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఇదే : విజయసాయి రెడ్డి

2.05 pm, బుధవారం, Dec 20, 2023
ముందుకా.? వెనక్కా?

  • చివరి క్షణం వరకు పవన్‌ కళ్యాణ్‌ తర్జన భర్జన
  • లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై చర్చలు
  • ప్యాకేజీ తీసుకుని సభకు వస్తున్నాడని జరిగిన ప్రచారం గురించి పవన్‌కు చెప్పిన జనసేన నేతలు
  • ఇప్పుడు సభకు వెళ్తే మరింత చెడ్డ పేరు వస్తుందని సూచన
  • తెలుగుదేశం విడుదల చేసిన అడ్వర్టైజ్‌మెంట్లలో కనీసం ఫోటో కూడా పెట్టలేదని గుర్తు చేసిన నేతలు
  • చంద్రబాబు పిలిచిన తర్వాత వెళ్లకపోతే బాగుండదన్న పవన్‌ కళ్యాణ్‌
  • విజయవాడ నుంచి విశాఖకు బయల్ధేరిన పవన్ కల్యాణ్
  • గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్ధేరిన పవన్
  • యువగళం-నవశకం బహిరంగ సభలో పాల్గొననున్న పవన్

12.45 pm, బుధవారం, Dec 20, 2023
లోకేష్‌కు మంత్రి అంబటి చురకలు

12.40 pm, బుధవారం, Dec 20, 2023
వేదికపై 600 మందా?

  • నేడు యువగళం ముగింపు సభ
  • విజయనగరం : పోలిపల్లిలో లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభ
  • 2014 తరువాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్
  • ఏకంగా 600 మందిని వేదిక పైకి ఎక్కిస్తోన్న తెలుగుదేశం
  • ఎలాగైనా సభను సక్సెస్‌ చేయాలని తెగ తాపత్రయపడుతోన్న టిడిపి
  • లోకేష్‌ సభకు జనసమీకరణ చేసిన వారికే పార్టీలో ప్రాధాన్యమని ఇప్పటికే సూచనలు
  • భవిష్యత్తులో పార్టీ టికెట్‌ కోసం రావాలంటే ఇప్పుడు జనాన్ని తీసుకురావాల్సిందేనని సూచనలు
  • ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి పాదయాత్రకు ప్రచారం కల్పించేందుకు లోకేష్‌ పాట్లు

12.35pm, బుధవారం, Dec 20, 2023
యువగళం కాదు అసత్యగళం.. టీడీపీతో జాగ్రత్త

  • యువగళంపై వైఎస్సార్‌ జిల్లా కమలాపురం యువనేత నరేన్ రామంజుల రెడ్డి స్పందన
  • రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థులు పాదయాత్ర చేసేవారు
  • మొదటి సారి ఒక కార్యదర్శిగా పాదయాత్ర చేస్తూ అబద్దాలు చెబుతున్నారు
  • యువగళం కాదు .. అసత్య గళం
  • చంద్రబాబు జైలుకు వెళ్ళగానే పాదయాత్ర గాలికి ఎగిరిపోయింది
  • టీడీపీ ప్రకటించిన హామీలు అన్ని బూటకమే
  • ప్రజలను మభ్య పెట్టేందుకు, ప్రభుత్వం పై దుష్ప్రచారం
  • పేద ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చూస్తుంటే
  • వారిని మభ్య పెట్టేందుకు చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారు
  • పేదలకు న్యాయం చేస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు
  • ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు
  • ప్రజల కష్టాలు తీరుస్తున్న మంచి నాయకుడు ఎవరనేది గుర్తించండి
  • ప్రజలకు ఎవరు మేలు చేస్తే వారికి అండగా ఉండండి
  • టీడీపీకి జెండా లేదు.. అజండా లేదు.. ఒక సిద్ధాంతం లేదు
  • ప్రజలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి


12.30pm, బుధవారం, Dec 20, 2023
జగన్‌తో ఢీనా?.. మీరు పనికిరారూ

  • విజయవాడ గడప గడపకులో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • టీడీపీ, జనసేనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే విష్ణు
  • యువగళం యాత్రతో ప్రజలకు ఒక హామీనైనా ఇచ్చారా.
  • యువగళం పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు చెప్పండి
  • చంద్రబాబుకి రాజకీయ ఎజెండా తప్ప ప్రజల అవసరాలు సంబంధం లేదు
  • చంద్రబాబు ఏజెంట్ ని ప్రజలు తిరస్కరిస్తున్నారు
  • చంద్రబాబుకు గ్యారెంటీ లేక పవన్ కళ్యాణ్ ని తెచ్చుకుంటున్నాడు.
  • నీకే గ్యారెంటీ లేకపోతే ఇంకా ప్రజలకి చంద్రబాబు ఏమి గ్యారెంటీ ఇవ్వగలడు
  • 2014లో కలిసి ఉన్నారు తర్వాత ఇద్దరు తిట్టుకున్నారు కదా.
  • సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు మీ ఇద్దరు బలం సరిపోదు
  • సీఎం జగన్ మేనిఫెస్టో ఐడియాలజీకి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దేనికి పనికిరారు



12.28pm, బుధవారం, Dec 20, 2023
అది ఒక అసమర్ధుడి విజయోత్సవ సభ

  • నారా లోకేష్‌ యువగళం ముగింపు సభ కోసం ప్రైవేట్‌ బస్సులు
  • ఆర్టీసీ బస్సులైతే లెక్క తెలుస్తుందని వీళ్లు అసలు అడిగి ఉండరు.
  • ప్రైవేటు బస్సులైతే వేలవేల బస్సులు వచ్చాయని చెప్పుకోవచ్చని వారి ఆలోచన కాబోలు. 
  • పాపం అసమర్ధుడి విజయోత్సవ సభకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 
  • లోకేశ్‌ ఏం యుద్ధం చేశాడో చెప్పాలి...పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప. 
  • ఆయన ప్రజల్లో గెలవకుండా మంత్రి చేశాడు. అలాంటి వ్యక్తికి ప్రజాదరణ ఏముంటుంది? 
  • మధ్యలో ఎందుకు పాదయాత్ర ఆపేశాడు..? 53 రోజులు ఎందుకు సెలవు పెట్టాడు. 
  • లోకేశ్‌ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు. ఎప్పటికీ కాలేడు. రాజకీయాలకు పనికివచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. 
  • ఏదో ఆతని అదృష్టం కొద్దీ చంద్రబాబు కుమారుడు అవ్వడం వల్ల అతన్ని మోసి నాయకుడిని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 
     




12.22pm, బుధవారం, Dec 20, 2023
TDP-YSRCP ప్రభుత్వాలకు తేడా ఇదే!

  • రెండు ప్రభుత్వాల హయాంలో అప్పులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
  • జగన్‌ పాలనలో కంటే బాబు హయాంలోనే మూడురెట్లు అధికం
  • కార్పొరేట్లకు బాబు ప్రయోజనం చేకూరిస్తే.. పేదల కోసం సీఎం జగన్‌ ఖర్చు చేస్తున్నారు


12.02pm, బుధవారం, Dec 20, 2023
పవన్‌కు కాపులెందుకు ఓట్లేస్తారు?

  • అనంతపురంలో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు
  • భారీగా పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, అభిమాన శ్రేణులు
  • హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ హాట్‌ కామెంట్స్‌
  • కాపు -బలిజ ప్రయోజనాలను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్‌ తాకట్టు పెట్టారు 
  • సొంతంగా పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. కాపులెందుకు ఓట్లేస్తారు?
  • సీఎం జగన్‌ పాలనలో  రాష్ట్రమంతటా సంక్షేమం అందుతోంది
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పార్టీలకు ఘెర పరాభవం తప్పదు


11.30am, బుధవారం, Dec 20, 2023
నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

  • ఇసుక స్కాం కేసులో నిందితుడిగా చంద్రబాబు
  • ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేత
  • వరుసగా.. ఈ వారంలో కొనసాగుతున్న విచారణ
  • నేడూ విచారించనున్న బెంచ్‌
  • గత ప్రభుత్వంలో.. చంద్రబాబు హయాంలో ఉచితం పేరిట ఇసుక అక్రమ దందా
  • సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి 
  • నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చిన దర్యాప్తు సంస్థ
     

11.13am, బుధవారం, Dec 20, 2023
వేడేక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

  • అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో ముందుకెళ్తోన్న సీఎం జగన్‌
  • సింగిల్‌గా పోటీ చేయలేక దిక్కులు చూస్తోన్న టిడిపి, జనసేన
  • పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు, పవన్‌
  • నిన్నంతా సీట్ల లెక్కలో తలమునకలయిన బాబు, పవన్‌
  • పవన్‌ లెక్క 50/5, చంద్రబాబు లెక్క 25/2

10.30am, బుధవారం, Dec 20, 2023
అయ్యా.. మీవాళ్లు మా భూములు కాజేశారు

  • విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం
  • ఇవాళ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం ముగింపు సభ జరిగేది ఇక్కడే 
  • ఈ తరుణంలో వెలుగు చూసిన టీడీపీ కబ్జాదారుల దౌర్జన్యం 
  • కబ్జా చేసిన భూముల్లో ప్లకార్డులు ప్రదర్శించిన బాధితులు 
  • ‘అయ్యా చంద్రబాబు, లోకేశ్‌.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తప్పుడు పత్రాలు, ఫోర్జీరీ సంతకాలతో మా భూములు కాజేశారు’ అంటూ ఫ్లకార్డులు
  • న్యాయం చేయాలంటూ భూమి యజమాని వారసుల ఆందోళన 
  • తమకు జరిగిన అన్యాయంపై పవన్‌ ప్రశ్నించాలని డిమాండ్‌  
  • న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టీకరణ  



 

9.45am, బుధవారం, Dec 20, 2023
సొంత పుత్రుడి.. ఉత్త యాత్ర

  • ప్రజా స్పందన కరువైన లోకేష్‌ పాదయాత్ర
  • 226 రోజులకే పరిమితమైన పాదయాత్ర
  • 400 రోజులు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటూ లోకేష్‌ ప్రగల్బాలు
  • అవగాహన రాహిత్యపు మాటలతో నవ్వులపాలైన లోకేష్‌
  • చంద్రబాబు ఎవరికి ఇస్తే వారిదే టికెట్‌ అంటూ ప్రకటనలు

9.30am, బుధవారం, Dec 20, 2023
నిరంతరాయంగా అసత్య కథనాలే!: YSRCP

  • ప్రజలు ఉతికి ఆరేసిన పార్టీ టీడీపీ 
  • దానిని తిరిగి అధికారంలోకి తేవడం కోసం ఈనాడు ఉన్మాద రాతలు 
  • ఆ రాతలకు హద్దే లేకుండా పోతోంది 
  • ఉచిత విద్యుత్‌ కావాలని అడిగితే కాల్పులు జరిపిందెవరు?
  • జగన్‌ పాలనలో పగటి పూట ఉచిత విద్యుత్‌ అందిస్తుంటే ఓర్వలేకపోతోంది యెల్లో మీడియా 
  • అసత్య కథనాలు అల్లేసి విష ప్రచారానికి దిగాడు రామోజీ

     


 

8.30am, బుధవారం, Dec 20, 2023
యెల్లో మీడియా కథనాలపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

  • టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే
  • ఆస్తుల కల్పనకు వెచ్చించే మూల ధన వ్యయం ఇప్పుడే అధికం  
  • అనధికారిక డిపాజిట్లు మార్గదర్శిలోనే ఉంటాయ్‌ రామోజీ! 
  • అప్పులు, పెండింగ్‌ బిల్లులంటూ ఊహాజనిత ప్రచారాలు 
  • ప్రభుత్వాలకు అనధికారిక అప్పులుండవనే ఇంగితజ్ఞానం లేదా? 
  • తప్పుడు కథనాలతో మరోసారి దిగజారుడు తనాన్ని చాటుకున్నారు

8am, బుధవారం, Dec 20, 2023
బెజవాడ తెలుగుదేశంలో రచ్చ రచ్చ

  • బెజవాడ ఎంపీ సీటుపై ముసలం
  • విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్న బీసీ సంఘాలు
  • ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న బుద్ధా వెంకన్న
  • తన సీటుకు ఎసరు పెడుతుండటంతో బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ కేశినేని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎంపీ
  • విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ ను ఆహ్వానిస్తున్నా
  • కాల్ మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు
  • బుద్ధావెంకన్నను టార్గెట్ చేసి ఘాటైన కామెంట్స్ చేసిన కేశినేని నాని
  • నీతి , నిజాయితీ , మచ్చలేని వ్యక్తులే అసలైన బిసిలు
  • కాల్ మనీ , సెక్స్ రాకెట్ , గూండాగిరీ చేసేవాళ్లు బిసిల కిందరారు
  • నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం
  • భూకబ్జాలు చేసేవాళ్లు, జనాలను హింసించిన వాళ్లు బిసిలు కాదు
  • పార్టీకోసం కష్టపడిన నిఖార్సైన బిసిలు చాలామంది ఉన్నారు
  • అలాంటి వారికి టిక్కెట్లిస్తే సంతోషిస్తా : కేశినేని


7.30am, బుధవారం, Dec 20, 2023
జనసేనాని ఇంత దిగజారిపోతానుకోలేదు

  • రాను రాను.. అంటూనే యువగళం ముగింపు సభకు జనసే చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌
  • చంద్రబాబు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి బతిమాలిన వైనం
  • చివరకు ‘షరతుల’పై వచ్చేందుకు ఒప్పుకున్న పవన్‌!
  • చివరికి అసమర్థుడు అయినటువంటి నారాలోకేష్‌ను కనకపు సింహాసనాన్ని ఎక్కించడానికి.. కిరాయి తీస్కొని యాంకరింగ్ చేసే స్థాయికి దిగజారిపోయడు జనసేన అధ్యక్షుడు

7am, బుధవారం, Dec 20, 2023
పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement