AP Politics: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Political Updates On February 8, 2024 | Sakshi
Sakshi News home page

AP Political News Feb 8th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Thu, Feb 8 2024 7:18 AM | Last Updated on Thu, Feb 8 2024 8:32 PM

AP Political Updates Feb 8th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

8:20PM, 7:10PM, Feb8, 2024

తిరుపతి

జగనన్న ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు: హోంమంత్రి తానేటి వనిత 

  • ప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలలకే కరోనా విపత్తు  రావడంతో ఆర్థికంగా ఉన్న దేశాలు కూడా అతలాకుతలం అయ్యాయి.
  • సీఎం జగన్‌ తెలివిగా ప్రతి ఇంటికి వాలంటీర్‌ వ్యవస్థతో పరిపాలన అందించారు
  • ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తాం
  • జనసేన-టీడీపీ గోదావరి జిల్లాలో బలంగా ఉంటే ఎందుకు పొత్తులు
  • ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా దీనిబట్టి తెలుస్తుంది ఎవరు బలం గా ఉన్నారో
     

8:06PM, 7:10PM, Feb8, 2024

విశాఖ: 
చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి రోజా

  • ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేవు
  • గట్స్‌ ఉన్న నాయకుడు సీఎం జగన్‌
  • చంద్రబాబు, లోకేష్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి
  • వయసులో చిన్నవాడైన అమిత్‌ షా కాలు పట్టుకోవడం సిగ్గుచేటు
  • చంద్రబాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు

7:10PM, Feb8, 2024

బలహీనంగా ఉన్నారు కాబట్టే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: సజ్జల

  • తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది
  • బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారు
  • పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారు
  • సీ ఓటర్‌ సర్వే విశ్వసనీయత ఏంటనేది ప్రజలకు తెలుసు
  • ఐదేళ్లలో మేం చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నాం
  • సీఎం జగన్‌ చేసిన అభివృద్ధే.. మరోసారి గెలిపిస్తుంది
  • ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికే లేదు
  • చంద్రబాబు అద్దె మైకులా షర్మిల మాట్లాడుతున్నారు

5:24pm, Feb 8, 2024

బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: ఎంపీ నందిగం సురేష్‌

  • ప్రధాని మోదీని తిట్టిన బాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడటం సిగ్గుచేటు
  • తాను ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.
  • పవన్‌ కళ్యాణ్‌ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా-వేళ్లా పడుతున్నాడు
  • తన పాలనలో  మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు జగన్‌
  • మేము చేసిన అభివృద్ధి పేదల ఖాతాలో ఉంది
  • చంద్రబాబు 14 ఏళ్లలో దోచుకున్నాడు
  • తన జీవితలో బాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు
  • చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు
  • లగడపాటి లాంటి సర్వేలే ఇవి

4:30pm, Feb 8, 2024

సీఎం వైఎస్ జగన్‌ది చారిత్రాత్మక పరిపాలన: మంత్రి కొట్టు సత్యనారాయణ 

  • ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తున్నారు 
  • పనిచేశాం ఆదరించండంటూ 2024 ఎన్నికలకు వెళ్తున్నాం
  • జగన్‌కి ఉన్న జనాదరణ చూసి ప్రతిపక్షం ఓర్చుకోలేక పోతోంది 
  • ఐదేళ్లలో 4500 ఆలయాలను అభివృద్ధి చేసాము 
  • దేవాలయాల అభివృద్ధికి రూ. 600 కోట్లు ,శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 360 కోట్లు ఇచ్చాము 
  • శ్రీశైలంలో సామాన్యభక్తులకోసం సాలమండపాలు ఏర్పాటు చేస్తున్నాము

4:15pm, Feb 8, 2024
రేషన్‌ డీలర్లకు గుడ్‌ న్యూస్‌

  • ఏపీ రేషన్ డీలర్ల కు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం
  • పెండింగ్ లో ఉన్న డీలర్ల కమీషన్ కు సంబంధించి 23 కోట్ల 71 లక్షల చెక్కును రిలీజ్ చేసిన మంత్రి కారుమూరి నాగేశ్వర రావు
  • 2012 నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు కు సరఫరా చేసిన సరకుల కమిషన్ డబ్బు 25 కోట్ల రూపాయలు మేర రేషన్ డీలర్ లకు చెల్లింపులు చేశాం
  • డోర్ డెలివరీ ద్వారా ప్రస్తుతం సరకుల సరఫరా జరుగుతున్నా రేషన్ డీలర్ లను కూడా కొనసాగిస్తున్నాము
  • రామోజీరావుకి మతిభ్రమించినట్టుంది, ఆయనకి కూడా అల్జీమర్స్ వచ్చిందేమో అర్థంకావటం లేదు
  • ఇప్పుడు రేషన్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • దాన్ని తట్టుకోలేక ఈనాడు పత్రికలో తప్పుడు కధనాలు వండివారుస్తున్నారు
  • రామోజీ ఎన్ని దొంగరాతలు రాసినా ప్రజలు పట్టించుకోరు, టిడిపిని పక్కనపెడతారు
  • క్రెడిబులిటీ పోగొట్టుకొంటున్న రామోజీని జనం అసహ్యించుకొంటున్నారు
  • ఎన్ని రాతలు రాసినా పేదల పక్షపాతిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ వెంటే జనం ఉంటారు .

4:10pm, Feb 8, 2024
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌.. ఏపీ ది బెస్ట్‌

  • వైఎస్సార్ సిపి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాద్
  • సిఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకి మేలు కలిగేలా పాలన చేస్తున్నారు
  • కరోనాతో‌ కుదేలైన పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చారు
  • రాష్ట్ర వ్యాప్తంగా MSME రంగానికి ప్రోత్సాహమిచ్చారు
  • ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లుగా నెంబర్ వన్ గా ఉన్నాం

4:05pm, Feb 8, 2024
ప్రతీ చోట.. ఫ్యాన్‌దే హవా.. గెలిచి బహుమతిస్తాం

  • అరకు వైసీపీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కామెంట్స్
  • సీఎం జగన్ గిరిజన పక్షపాతి
  • గిరిజన ప్రాంతంలో సంక్షేమం, అభివృద్ధి  బాగా చేశారు.
  • అరకు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేశారు.
  • గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారు.
  • గిరిజనులు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు.
  • గిరిజన ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ కి మంచి ఆదరణ ఉంది
  • గిరిజనులంతా జగన్ వెంటే ఉంటారు.
  • 2024 ఎన్నికల్లో గిరిజన ప్రాంతంలోని అన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిపించి జగన్ కిమద్దతుగా నిలుస్తాం

3:45pm, Feb 8, 2024
YSRCP రాజ్యసభ అభ్యర్థులు వీరే

  • వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
  • ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు
  • ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను అభినందించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

3:30pm, Feb 8, 2024
హస్తిన నుంచి హైదరాబాద్‌కు బాబు

  • బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు
  • బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • చంద్రబాబు వెంట మాజీ మంత్రి నారాయణ
  • జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు
  • ఇవ్వాళ చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయ్యే అవకాశం

3:00pm, Feb 8, 2024
ఎన్నికలప్పుడు కూడా ఇంట్లో ఉంటే బాగుండదని..!

  • మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు నారా లోకేష్ కసరత్తులు
  • పాదయాత్ర తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న లోకేష్‌
  • జనాల్లో ఉండడం లేదని లోకేష్‌పై రాజకీయ విమర్శలు
  • శంఖారావం పేరుతో యాత్ర చేయాలని లోకేష్ నిర్ణయం
  • పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాల్లో పర్యటించాలని లోకేష్ తాపత్రయం
  • 40 రోజుల పాటు రోడ్లపైకి లోకేష్ వస్తాడని ప్రకటించిన అచ్చెన్నాయుడు

2:43 pm, Feb 8, 2024
అంతా బాబు గారి దయ.!

  • మా అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా : నాగబాబు
  • తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు

2: 30 pm, Feb 8, 2024
అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్: రావెల

  • అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు
  • 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర 
  • ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసింది
  • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నభూఃతో నఃభవిష్యత్ 
  • బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం యావత్ ప్రపంచ అంబేద్కర్వాదులు గర్వించదగిన విషయం 
  • సమసమాజ స్థాపనకు జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారు 
  • ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా 
  • భారతదేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 
  • కాదని నిరూపించే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా? 
  • నిరూపించే సత్తా ఉంటే రండి బహిరంగంగా చర్చిద్దాం 
  • అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే జగనే మళ్లీ సీఎంగా ఉండాలి 
  • జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ బలపరచాలి

2: 10 pm, Feb 8, 2024
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహ

  • నిన్న(బుధవారం) సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం వెయిటింగ్‌
  • చివరికి అర్థరాత్రి చంద్రబాబును పిలిపించిన అమిత్‌, జేపీ నడ్డా
  • భేటీ తర్వాత గప్‌చుప్‌గా చంద్రబాబు
  • పవన్‌ కళ్యాణ్‌తో మళ్లీ రాయభారం నడుపుతున్న చంద్రబాబు

1: 40 pm, Feb 8, 2024
చంద్రబాబు నివాసానికి పవన్

  • హైదరాబాద్‌కు చంద్రబాబు
  • బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలను రాత్రి ఢిల్లీలో కలిసిన చంద్రబాబు
  • బీజేపీ అగ్రనేతలతో చర్చల సారాంశంపై చంద్రబాబు, పవన్ చర్చ
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత
  • కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న పవన్‌. 

1: 20 pm, Feb 8, 2024
గిరిజనుల పక్షపాతి సీఎం జగన్‌ : ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కామెంట్స్
  • గిరిజన ప్రాంతంలో సంక్షేమం , అభివృద్ధి  బాగా చేశారు.
  • అరకు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేశారు.
  • గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారు.
  • గిరిజనులు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు.
  • గిరిజన ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ కి మంచి ఆదరణ ఉంది
  • గిరిజనులంతా జగన్ వెంటే ఉంటారు.
  • 2024 ఎన్నికల్లో గిరిజన ప్రాంతంలోని అన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిపించి జగన్కి మద్దతుగా నిలుస్తాం.

12:45 pm, Feb 8, 2024
మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వస్తారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

  • శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
  •  సంక్షేమ పాలనతో సీఎం వైఎస్ జగన్  ప్రజలకి ఎన్నో మేలు చేశారు
  • చంద్రబాబు దిగిపోయే సమయానికి ఖజానాలో వందకోట్లే ఉన్నాయి
  •  చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేశారు
  •  కరోనా ఇబ్బంధులు, విభజన లోటు ఉన్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లారు
  •  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో  ఏపీ నంబర్ వన్
  • చంద్రబాబు హయాంలో విద్యారంగంలో జిఇఆర్ లో రాష్ట్రం 32 వ స్ధానంలో ఉంటే సీఎం వైఎస్ జగన్ హయాంలో కేరళని దాటి మొదటి స్ధానానికి చేరాం
  • ఇది సంక్షేమ బడ్జెట్
  •  ఇది వైఎస్సార్ ఆశయాలకి అనుగుణమైన బడ్జెట్
  •  చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు
  • సీఎం వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయంతో పాటు వైద్య, విద్యా రంగాలకి అత్యధిక ప్రాదాన్యతనిచ్చారు

11:00 AM, Feb 8, 2024
ఆత్మగౌరవ భక్షకుడిగా చంద్రబాబు: చెల్లుబోయిన సెటైర్లు

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన కామెంట్స్‌
  • అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాప్ పెట్టించిన ఘనుడు చంద్రబాబు 
  • ఇప్పుడు సిగ్గులేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నాడు 
  • తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారు 
  • తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు  ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు 
  • ఆత్మగౌరవ భక్షకుడిగా చంద్రబాబు మారాడు 
  • చంద్రబాబు చేష్టలకు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది 
  • ఎన్టీఆర్‌ను పదవిలో నుంచి దించేసిన బాబు రాజకీయ వ్యాపారం మొదలుపెట్టాడు 
  • బాబుకు మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ఛానల్స్‌ 
  • జన్మభూమి కమిటీలతో పేదల ఆత్మగౌరవం మీద దెబ్బతీశాడు
  • 2014లో బీజేపీతో కలిసి తర్వాత విభేదించారు
  • 2024లో మళ్ళీ చీకట్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు
  • ఇక్కడ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడు
  • పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు 
  • పేదవాడిని పేదవాడిగా మిగిల్చేందుకే టీడీపీ పొత్తులు 
  • చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించటానికి కాదు, సంపాదన కోసం 
  • చంద్రబాబులా ఆచరణ సాధ్యం కానీ హామీలు సీఎం జగన్ ఇవ్వరు 
  • చేయగలిగితేనే మాట ఇస్తారు 
  • ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొంటారు 

9:45 AM, Feb 8, 2024
చంద్రబాబు ఢిల్లీలో గల్లీలు తిరుగుతున్నాడు: వెలంపల్లి శ్రీనివాస్‌

  • వైఎస్సార్‌సీపీకి కేడరే మంచి బలం 
  • సెంట్రల్ నియోజకవర్గంలో రోజుకొక డివిజన్‌లో పర్యటిస్తున్నాను 
  • కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది 
  • సీఎం జగన్‌ అందిస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • జగనన్న మాత్రమే ఇన్ని సంక్షేమ పథకాలు చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు 
  • 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క పథకమైనా సీఎం జగన్‌లా ఇవ్వగలిగాడా?.
  • మరోమారు తప్పుడు వాగ్ధానాలతో చంద్రబాబు వస్తున్నాడు 
  • పవన్‌తో పాటు పొత్తుపెట్టుకున్నాడు 
  • బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నాడు 
  • ఢిల్లీలో గల్లీగల్లీ తిరుగుతున్నాడు 
  • పవన్‌కు సినిమా క్రేజ్ ఉంటే సినిమా చూస్తారు కానీ. ఓటు వేయరు కదా. 
  • చంద్రబాబు, పవన్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా కలిసి వచ్చినా.. వచ్చేది సీఎం జగన్‌ ప్రభుత్వమే. 
  • సెంట్రల్ నియోజకవర్గంలో 25వేల మెజార్టీతో గెలుస్తా

08:00 AM, Feb 8, 2024
పార్టీ ఫిరాయింపు నేతలపై నేడు విచారణ

  • నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తమ్మినేని విచారణ
  • ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్‌ నోటీసులు 
  • ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. 
  • వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. 
  • ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు. 

07:15 AM, Feb 8, 2024
వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టిన ప్రజలు..

  • ఏపీలో ఎన్నికలపై టౌమ్స్‌నౌ సర్వే
  • రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 19 స్థానాల్లో విజయం
  • టీడీపీ-జనసేన కూటమికి ఆరు స్థానాలు
  • కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు జీరో స్థానాలు
  • సీఎం జగన్‌ సర్కార్‌ పనితీరుకు పట్టం కట్టారు ప్రజలు. 
  • ముఖ్యమంత్రి జగన్‌ పనితీరు పట్ల 38 శాతం మంది అత్యద్భుతం అని కితాబు ఇచ్చారు. 
  • మరో 26 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన బాగుందని ప్రశంసించారు. 
  • మొత్తంగా 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 

07:00 AM, Feb 8, 2024
రాప్తాడు సిద్ధం సభ 18న

  • అనంతపురం రాప్తాడులో ఈ నెల 11న సిద్ధం సభకు ఏర్పాట్లు
  • అనివార్య కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ఈనెల 11కు బదులుగా 18వ తేదీన సిద్ధం సభ ఉంటుందని వెల్లడి
  • చంద్రబాబుపై మం‍త్రి పెద్దిరెడ్డి విమర్శలు
  • చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు
  • ఇందులో భాగంగానే బీజేపీ పెద్దలతో భేటీ
  • వలంటీర్లపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది
  • కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంట్లో దాక్కుంటే... ప్రజలకు సేవలు అందించింది వలంటీర్లే
  • భద్రత లేదని షర్మిల అంటున్నారు
  • కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పుడు.. మాకు రక్షణ తొలగించారు
  • అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మా మద్దతుతో గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు 
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నా కుటుంబానికి భద్రత కల్పించలేదు
  • మా నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు
  • పాదయాత్రలో వైఎస్‌ జగన్ కూ తగిన భద్రత కల్పించలేదు

06:50 AM, Feb 8, 2024
అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్: ఎంపీ విజయసాయిరెడ్డి 

  • రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ
  • వైఎస్సార్సీపి తరఫున బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి 
  • కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చేసిన నష్టం గురించి ప్రస్తావిస్తూ.. విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
  • కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాలకి దేశ ప్రజలను తాకట్టు పెట్టింది 
  • దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం
  • కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ప్రజలు ఎన్నటికీ క్షమించరు 
  • కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఆర్థికంగా అధోగతి పాలయింది 
  • ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనడానికి  గణాంకాలే సాక్ష్యం 
  • దేశ జిడిపి ఏడు శాతాన్ని దాటింది 
  • కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది
  • ధనిక పేదల మధ్య అంతరం తగ్గుతుంది 
  •  కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ధరలు విపరీతంగా పెరిగాయి
  •  అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ
  • కాంగ్రెస్ సహాయం లోని దేశంలో 2జి, కామన్వెల్త్,  బొగ్గు కుంభకోణం లాంటి బ్ అతిపెద్ద కుంభకోణాలు జరిగాయి 
  • 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 142వ స్థానం ఉన్న దేశం ఇప్పుడు  నుంచి 62 కి  పెరిగింది

06:40AM, Feb 8, 2024
ఉత్తరాంధ్రలో సైకిల్‌ ఉల్టాపుల్టా

  • రాజమండ్రి నుంచి పోటీకి బాలయ్య చిన్నల్లుడు సన్నాహాలు
  • ఇప్పటికే ఓసారి సర్వే చేయించుకున్న భరత్
  • విశాఖ సీటు పొత్తులో బీజేపీకి ఇస్తే రాజమండ్రి ఇవ్వాలని అడుగుతోన్న భరత్
  • ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎంపీగా పోటీ చేస్తానంటున్న భరత్
  • ఇప్పటికే రాజమండ్రి టికెట్ పై శిష్ట్లా లోహిత్ కి హామీ ఇచ్చిన లోకేష్‌
  • బొడ్డు వెంకటరమణ చౌదరికి అభయమిచ్చిన చంద్రబాబు
  • టీడీపీ - జనసేన మధ్య పాయకరావుపేట సీటు వివాదం
  • పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు తమకే కేటాయించాలన్న జనసేన
  • తమకు సీటు ఇవ్వకపోతే టీడీపీకి సహకరించేది లేదన్న జనసేన

06:30 AM, Feb 8, 2024
విజయవాడలో జనసైనికుల వీరంగం

  • విజయవాడ : బెజవాడలో జనసేన నాయకుడు పోతిన మహేష్ అనుచరుల వీరంగం
  • పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన మహేష్ కు చెందిన జనసేన కార్యాలయం ముందు దాడి
  • జనసేనకు చెందిన మైనార్టీ నాయకుడు యెజాజ్ వద్ద రెండేళ్ల క్రితం స్థలం కొనుగోలు చేసిన రుహుల్లా
  • ధర ఎక్కువగా ఉండటంతో యెజాజ్ ను ఒప్పించి తక్కువకు ఇప్పించాలంటూ పోతిన మహేష్ కార్యాలయానికి వచ్చిన రుహుల్లా
  • తనతో మాట్లాడుతుండగా రుహుల్లాకు తెలియకుండా వీడియో తీయించిన పోతిన మహేష్
  • ఇటీవల మైనార్టీ కోటాలో వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్న యెజాజ్
  • యెజాజ్ తనకు అడ్డుకురాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం తీసిన వీడియోను మార్పులు చేసి సోషల్ మీడియాలో పెట్టించిన పోతిన మహేష్
  • వివరణ కోరేందుకు పోతిన మహేష్ కార్యాలయానికి వెళ్లిన రుహుల్లా, యెజాజ్
  • యెజాజ్ అనుచరులతో ఘర్షణకు దిగిన పోతిన మహేష్ అనుచరులు
  • అసభ్య పదజాలంతో దూషిస్తూ...విచక్షణా రహితంగా దాడి చేసిన పోతిన మహేష్ అనుచరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement