బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు 'యతీంద్ర సిద్ధరామయ్య' ప్రధానమంత్రి మోదీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీని, ఆయన ఇంటిని కించపరిచే పదజాలంతో దూషించారని పార్టీ నేతలు మండిపడ్డారు.
చామరాజనగర జిల్లా హనూర్ పట్టణంలో జరిగిన పార్టీ సమావేశంలో యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపించింది. రాజకీయ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
హోం మంత్రి అమిత్ షాను 'గూండా' అని, ఆయన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. అంతే కాకుండా నేర చరిత్ర ఉన్న వారితో మోదీ సహవాసం చేస్తున్నారని ఆరోపించారు.
యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సబబు కాదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. శాసనసభ్యుడిగా పనిచేసి.. ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయిన వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యతీంద్ర సిద్ధరామయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment