Yathindra Siddaramaiah
-
సిద్దరామయ్య కొడుకుపై బీజేపీ నేతలు ఫైర్: ఎందుకంటే?
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు 'యతీంద్ర సిద్ధరామయ్య' ప్రధానమంత్రి మోదీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీని, ఆయన ఇంటిని కించపరిచే పదజాలంతో దూషించారని పార్టీ నేతలు మండిపడ్డారు. చామరాజనగర జిల్లా హనూర్ పట్టణంలో జరిగిన పార్టీ సమావేశంలో యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపించింది. రాజకీయ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. హోం మంత్రి అమిత్ షాను 'గూండా' అని, ఆయన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. అంతే కాకుండా నేర చరిత్ర ఉన్న వారితో మోదీ సహవాసం చేస్తున్నారని ఆరోపించారు. యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సబబు కాదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. శాసనసభ్యుడిగా పనిచేసి.. ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయిన వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యతీంద్ర సిద్ధరామయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు. -
సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. వీడియోలో.. ఓ మీటింగ్‌లో జనం మధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ట్విటర్లో షేర్ చేశారు. క్యాష్ఫర్ పోస్టింగ్ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని, ఎలాంటి భయం లేకుండా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని, సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ గురించి అని తెలిపారు. క్యాష్ ఫర్ ఫోస్టింగ్ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో సుధీర్ఘ పోస్టు చేశారు. Unfortunately, former Chief Minister H.D. Kumaraswamy, who was involved in rampant corruption during his tenure, thinks all are like him. His pessimistic attitude does not allow him to think beyond corruption. His insecurity in politics often forces him to fabricate fake stories… — Siddaramaiah (@siddaramaiah) November 16, 2023 అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ Yathindra Siddaramaiah : ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹವಾ ಪ್ರತಿಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲಿಂಕ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ Click Here to Watch NewsFirst Kannada Live Updates LIVE Link : https://t.co/GFweTyzikB@siddaramaiah#CMSiddaramaiah #YathindraSiddaramaiah pic.twitter.com/Py38uVLcVv — NewsFirst Kannada (@NewsFirstKan) November 16, 2023 -
Karnataka Results: మా నాన్న సీఎం కావాలి : యతీంద్ర సిద్ధరామయ్య
మైసూర్ : ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుత సరళిని బట్టి కాంగ్రెస్ ముందంజలో ఉంది. దాంతో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. "బీజేపీ కి అధికారం దూరం చేసేందుకు మేం చేయాల్సిందంతా చేస్తాం. కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజార్టీ సాధిస్తుంది. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక ప్రయోజనాల కోసం మా నాన్న ముఖ్యమంత్రి కావాలి. ఒక కుమారుడిగా నా తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నాను. అంతకుముందు ఆయన నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించింది. ఇంతకాలం భాజపా పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని" మీడియాతో మాట్లాడుతూ యతీంద్ర వ్యాఖ్యానించారు. అదే విధంగా వరుణ నియోజవర్గం నుంచి తన తండ్రి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తారని చెప్పారు. కొనసాగుతన్న కాంగ్రెస్ అధిక్యం కర్ణాటకలో బుధవారం ఓటింగ్ జరగ్గా శనివారం ఉదయం ఎనిమిది నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్‌లో ఉంది. జేడీఎస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా పనిచేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇంకోపక్క రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పార్టీని ముందుండి నడిపించారు. హస్తం పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనది కీలక పాత్ర. ఆయనకూడా సీఎం పదవిపై తన ఆసక్తిని పలుమార్లు పరోక్షంగా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
కరోనాను జయించిన సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా వైరస్‌ను జయించారు. ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.యతీంద్ర సిద్ధరామయ్య సైతం వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సిద్ధరామయ్యకు ఆగస్టు 3న పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన బెంగళూరులోని మనిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయనకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దీంతో సిద్ధరామయ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే వైద్యుల సలహా మేరకు వారం రోజులు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండనున్నారు. (రాజుకున్న రాజధాని) ఈ సందర్భంగా తనకు పది రోజులుగా వైద్య సేవలందించిన ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి, తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన కార్యకర్తలకు సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఆయన కొడుకు యతీంద్ర సిద్ధరామయ్యకు కూడా ఆగస్టు 7న పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన కూడా కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా సోమవారం కరోనా నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. (యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!) -
బరిలో సీఎంల తనయులు
సాక్షి, బెంగళూరు: కన్నడనాట విధానసభ ఎన్నికల్లో ప్రస్తుత, పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతారని గతంలో ప్రకటించారు. అయితే ఆయనకు వరుణ నుంచి ఇంకా టికెట్ కేటాయించకపోయినప్పటికీ, విజయేంద్ర ఆ స్థానంలో పోటీ చేయడం దాదాపు నిశ్చయమేననీ, త్వరలోనే బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దరామయ్య తన ప్రస్తుత నియోజకవర్గం వరుణను వదిలేసి చాముండేశ్వరి నుంచి బరిలోదిగారు. యతీంద్రతో పాటు దాదాపు 10 మంది వరకు మాజీ సీఎంల వారసులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గతంలో సీఎంలుగా చేసిన గుండూరావు, జేహెచ్ పటేల్, ఎస్ఆర్ బొమ్మై, ధరమ్ సింగ్ తదితరులు కొడుకులను ఈసారి విధానసభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. ఇక మాజీ సీఎం బంగారప్ప ఇద్దరు పుత్రులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కుమార బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారులిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామే. యతీంద్ర వర్సెస్ విజయేంద్ర.. ప్రస్తుత ఎన్నిల్లో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన సిద్దరామయ్య, యడ్యూరప్ప వారసులు ఇద్దరూ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కుటుంబ రాజకీయాలకు ఆద్యుడైన దేవెగౌడను గతంలో సిద్దరామయ్య విమర్శించేవారు. జేహెచ్ పటేల్ కుమారుడు మహిమా పటేల్ దావణగెరి జిల్లాలోని చెన్నగిరి నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థిగా, ధరంసింగ్ తనయుడు అజయ్ సింగ్ కలబురిగి జిల్లాలోని జీవర్గి నుంచి, హావేరి జిల్లాలోని శిగ్గావ నుంచి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ బొమ్మై బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. అలాగే దివంగత మాజీ సీఎం గుండూరావ్ కొడకు, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేష్ 5వ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోటీలో శ్రీమంతులు దొడ్డబళ్లాపురం: కర్ణాటక ఎన్నికల బరిలో పలువురు శ్రీమంతులు దిగుతున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన వారిలో కొందరి ఆస్తులు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తమ కుటుంబ ఆస్తి విలువ రూ.1,015కోట్లుగా పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.102 కోట్లుగా చూపగా, రూ.27 కోట్ల 70 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తమ మొత్తం ఆస్తి విలువను రూ.470కోట్లుగా ప్రకటించడం గమనార్హం. అంటే ఈ ఐదేళ్లలో అది రెట్టింపైంది. కాగా, కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన విద్యుత్ మంత్రి డీకే శివకుమార్ ఆస్తి కూడా గత ఎన్నికల సమయంలో ప్రకటించిన దానికి రెట్టింపైంది. ఈసారి ఆయన తన ఆస్తి విలువను రూ.549 కోట్లుగా ప్రకటించారు. 2008లో కేవలం రూ.75కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 2013 ఎన్నికల నాటికి రూ. 251 కోట్లకు పెరిగింది. కాగా, శుక్రవారం మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్ వేశారు. ఎంటీబీ నాగరాజు -
నా కుమారుడిని ఆశీర్వదించండి
మైసూరు : తాను పోటీ చేస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో మూడుసార్లు ప్రచారం నిర్వహించిన సీఎం సిద్దరామయ్య మంగళవారం తన కుమారుడు డాక్టర్ యతీంద్ర పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి యతీంద్ర పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి బీ.ఎస్.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీలోఉన్నారు. దీంతో ఎలాగైనా∙ఈ ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించడం కోసం ప్రచారంలో వేగం పెంచారు. ఈ ప్రచారంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ... రాజకీయంగా తనకు జన్మనిచ్చింది వరుణ నియోజకవర్గం అయితే పునర్ జన్మనిచ్చింది చాముండేశ్వరి నియోజకవర్గమని సీఎం సిద్దరామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. నంజనగూడు తాలూకాలోని కోణనూరు గ్రామం నుంచి ప్రారంభించి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వరుణ నియోజక వర్గం తనకు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి స్థానం కల్పించిందని, వరుణ, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు అని అన్నారు. ఇక్కడి నుంచి తనను ఆశీర్వదించిన ప్రజలు ఈసారి తన కుమారుడిని ఆశీర్వదించాలన్నారు. రాకేష్‌ను గుర్తుకు చేసుకుని కన్నీళ్లు ప్రచారంలో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య తన పెద్ద కుమారుడు రాకేష్‌ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాలకు వస్తే తన పెద్దకుమారుడు తనకు గుర్తుకువస్తాడని అన్నారు. అతడే బతికి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదని, రాకేష్‌కున్న ప్రజలతో కలిసి తిరిగిన అనుభవం యతీంద్రకు లేదని అన్నారు. రాకేష్ ఉండి ఉంటే వరుణతోపాటు చాముండేశ్వరిలో సైతం తానే చూసుకుంటూ ప్రచారం చేసే వాడని కంటనీరు పెట్టుకున్నారు. -
ముఖ్యమంత్రి తనయుడిపై దుమారం!
బెంగళూరు: ఖరీదైన చేతి గడియారం వివాదం ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మరో బాగోతం చుట్టుముట్టుకుంది. తన కొడుకు డైరెక్టర్‌గా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు దక్కడం దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఏర్పాటుకు ఇటీవల మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తో కర్ణాటక ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. 2009 అక్టోబర్‌లో రమేశ్ గౌడ సీఎం, సతీష్ ప్రసాద్ భాగస్వాములుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. 2014 సెప్టెంబర్ లో ఈ కంపెనీ డైరెక్టర్‌గా సీఎం కొడుకు డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య చేరారు. విక్టోరియా ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ ఏర్పాటుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వేలంపాట నిర్వహించగా.. ఈ కాంట్రాక్టును ప్రభుత్వం మాట్రిక్స్ కంపెనీకి అప్పగించింది. ఇలా సీఎం తనయుడి సంస్థకు ప్రభుత్వ లబ్ధి చేకూర్చడం.. అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతమేనని తనపై రాజకీయంగా తీవ్ర ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. 'ఈ వ్యవహారమంతా పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగింది. ఈ కాంట్రాక్టు అప్పగించడంలో ఎలాంటి తప్పు జరగలేదు. నా కొడుకు వృత్తిరీత్య డాక్టర్. అతని స్నేహితుడు ఈ కంపెనీ స్థాపించాడు. నా కొడుకు డైరెక్టర్‌గా ఉన్నాడు' అని సిద్దరామయ్య తెలిపారు. ఈ కాంట్రాక్టు విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలంటే ఈ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమని సీఎం కొడుకు యతీంద్ర తెలిపారు. ప్రతిపక్ష బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై డిమాండ్ చేస్తోంది. 'ఆయన సీఎం కొడుకు అయినంతమాత్రాన ఏ పని చేయకూడదని కాదు. కానీ, ఆ కాంట్రాక్టు చట్టప్రకారం ఇచ్చారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిందే' అని కర్ణాటక ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప అంటున్నారు.