
జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ విజయంతో మరో యోగీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్వార్ ఎంపీ బాబా బాలక్‌నాథ్ రాజస్థాన్ యోగీగా ప్రసిద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి సీఎం అభ్యర్థి రేసులో ఆయన కూడా ముందు వరుసలో ఉన్నారు. తిజారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై బాలక్‌నాథ్ విజయం సాధించారు.
'బీజేపీకి ప్రధాన ముఖచిత్రం మన ప్రధాని. ఆయన నాయకత్వంలో మేం పనిచేస్తాం. ముఖ్యమంత్రి ఎవరనేది కూడా పార్టీయే నిర్ణయం తీసుకుంటుంది. ఎంపీగా సంతోషంగా ఉన్నాను. సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను చాలా సంతృప్తి చెందాను.”అని యోగీ బాలక్‌నాథ్ అన్నారు.
యోగీ బాలక్‌నాథ్ సీఎంగా అధికారం చేపడితే దేశంలో మరో యోగి సీఎం పదవిలో ఉన్నట్లు అవుతుంది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలక్‌నాథ్ కోసం యోగీ ఆదిత్యనాథ్ కూడా పాలు పంచుకున్నారు. విజయం ఖాయమైన తర్వాత బాలక్‌నాథ్ శివాలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment