
సాక్షి, హైదరాబాద్ : నగరంలో తమకు ఇష్టం ఉన్న ఆలయానికి వెళ్తామని, గుడికి వెళ్లాలంటే కేసీఆర్ అనుమతి తీసుకోవాలా?..లేక అసదుద్దీన్, అక్బరుద్దీన్ అనుమతి కావాలా?.. సచివాలయంలో కూల్చిన నల్లపోచమ్మ దేవాలయానికి వెళ్లాలా? అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజలు సమాధానం చెప్పారన్నారు. ( రోడ్డెక్కిన స్థానికులు: రోడ్డు వేస్తేనే ఓటు..)
హిందువుల ఆలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వం పరిధిలో ఉండాలని, అభివృద్ధి అంటే కార్పొరేటర్లు కబ్జాలు చేయడమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వచ్చాకే హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. కేంద్ర నిధుల పంపిణీ ఏ విధంగా ఉంటుందో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు తెలియదా?.. చింతమడకకు కేసీఆర్ ఇచ్చింది లక్షా 50 వేల రూపాయలు మాత్రమే.. కేంద్రం 8 లక్షల రూపాయలు ఇచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment